Tuesday, November 19, 2024

టాప్‌-10 కంపెనీల ఎం క్యాప్‌ 67వేల కోట్లు డౌన్‌.. భారీగా లాభపడిన హెచ్‌యూఎల్‌

టాప్‌ 10 కంపెనీల్లోని ఐదు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గత వారం రూ.67,843 కోట్లు పెరిగింది. హిందూస్తాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్స్‌ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గతవారం 57,000 పాయింట్లకు పైగా ముగిసింది. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్‌ యూనీలీవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ క్యాప్‌ పెరిగింది. అదేసమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాక్‌ నష్టపోయాయి. హిందూస్తాన్‌ యూనీలీవర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.25,234.61 కోట్లు పెరిగి.. రూ.5,25,627 కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.21,892.61 కోట్లు ఎగిసి.. రూ.18,87,964 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ క్యాప్‌ రూ.16,251 కోట్లు పెరిగి.. రూ.7,68,052 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,943 కోట్లు పెరిగి.. రూ.4,03,969.09 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.521 కోట్లు పెరిగి.. రూ.4,06,245 కోట్లకు ఎగబాకింది.

టీసీఎస్‌కు అత్యధిక నష్టం..

టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.22 కోట్లు తగ్గి.. రూ.12.98 లక్షల కోట్లకు, ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,474 కోట్లు క్షీణించి.. రూ.6,59,587 కోట్లకు, ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,480 కోట్లు క్షీణించి.. రూ.4.43 లక్షల కోట్లకు, ఐసీఐసీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,600 కోట్లు తగ్గి.. రూ.5.16 లక్షల కోట్లకు పడిపోయింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ.. రూ.172 కోట్లు క్షీణించి.. రూ.4.51 లక్షల కోట్లకు క్షీణించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement