Saturday, November 23, 2024

తగ్గిన హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం, గత నెల కంటే తక్కువ.. కూరగాయల ధరలు తగ్గడమే ప్రధాన కారణం

హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం జులైలో స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఇది 13.93 శాతంగా నమోదైంది. జూన్‌లో ఈ ద్రవ్యోల్బణం 15.18 శాతంగా ఉంది. గత సంవత్సరం జులైలో హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం 11.57 శాతం మాత్రమే. ఈ సంవత్సరం మే నెలలో గరిష్టంగా 15.88 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి వరసగా 16 నెలల కూడా హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం రెండ ంకెల పైనే నమోదవుతూ వస్తోంది. ఇది ధరల పెరుగుదలను సూచిస్తోంది. ఆహారపదర్ధాల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం ఉంటే, అది జులైలో 10.77 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు మాత్రం బాగా తగ్గాయి. జూన్‌లో ఇవి 56.75 శాతం ఉంటే, జులైలో 18.25 శాతంగా నమోదైంది. దీని ప్రభావం హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదం చేసింది. చమురు, విద్యుత్‌ ధరలు మాత్రం జూన్‌ కంటే జులైలో పెరిగాయి.

ఈ ద్రవ్యోల్బణం జూన్‌లో 40.38 శాతం ఉంటే, జులైలో ఇది 43.75 శాతంగా ఉంది. తయారు చేసిన ఉత్పత్తులు ధరలు 8.16 శాతం పెరిగాయి. నూనె గింజల ధరలు 4.06 శాతం తగ్గాయి. చమురు, ఇంధన ధరలు మాత్రం 40.38 నుంచి 43.75 శాతానికి పెరిగాయి. సాధారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. దీని ఆధారంగానే ఆర్బీఐ ఇటీవల వరసగా మూడు సార్లు రెపోరేట్లను పెెంచింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement