Monday, November 25, 2024

Lotus EV | ఇండియన్‌ మార్కెట్‌లోకి లోటస్‌ ఈవీ కారు

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ లోటస్‌ కారు భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఎక్స్‌క్లూజీవ్‌ మోటార్స్‌తో ఒప్పందం చేసుకున్న లోటస్‌ గురువారం నాడు కంపెనీ తన విద్యుత్‌ ఎస్‌యూవీ కారును లాంచ్‌ చేసింది. ఈ సంస్థ ఇండియాలో లోటస్‌ కార్ల మార్కెటింగ్‌ చేయనుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన లగ్జరీ విద్యుత్‌ ఎస్‌యూవీ కారు ఇది. దీని ధర 2.55 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ కారు మూడు వేరియంట్స్‌ ఎలట్రే, ఎలట్రే ఎస్‌, ఎలట్రే ఆర్‌ పేరుతో లభిస్తుంది. ఎలట్రే ధర 2.55 కోట్లు, ఎలట్రే ఎస్‌ ధర 2.75 కోట్లు, ఎలట్రే ఆర్‌ ధర 2.99 కోట్లు. ఈ కార్లు పవర్‌పుల్‌ డ్యూయల్‌ మెటార్స్‌తో లభిస్తాయి. టాప్‌ ఎండ్‌ కారు వంద కిలోమీటర్ల స్పీడ్‌ను కేవలం 2.95 సెకండ్లలోనే అందుకుంటుంది. ఎలట్రే, ఎలట్రే ఎస్‌ ఒక సారి ఛార్జింగ్‌ పెడితే 600 కి.మీ రేంజ్‌ ఇస్తాయి.

ఎలట్రే ఆర్‌ 490 కి.మీ రేంజ్‌ ఇస్తుంది.20 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. కంపెనీ 2024లో ఎమిరా అనే పెట్రోల్‌ వెర్షన్‌ లగ్జరీ కారును భారత్‌ మార్కెట్‌లోకి తీసుకు వస్తుందని ఎక్స్‌క్లూజీవ్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సత్య బగ్లా తెలిపారు. భారత్‌ మార్కెట్లోకి తీసుకు వచ్చిన ఎలట్రే కార్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. స్పోర్ట్‌ కార్లను ఇష్టపడే కస్టమర్లకు ఇది మంచి ఎంపికగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement