Saturday, November 23, 2024

దసరా పండుగవేళ లిక్కర్​ రేట్ల పెంపు.. 10 నుంచి 15శాతం పెంచాలన్న ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మద్యం ధరల పెంపు కోసం డిస్టిలరీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందుకు అనువుగా దసరా పండుగ సందర్భంగా లిక్కర్‌ కొరతను సృష్టిస్తూ కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే విమర్శలు వినిెపిస్తున్నాయి. ఒకవైపు దసరా పండుగ మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు మద్యం ధరల పెంపునకు డిస్టలరీలు అనువైన సమయంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో రాబడిని పెంచుకోవాలని భావించిన ఆబ్కారీ శాఖ అమ్మకాలు పెంచాలని, డిస్టలరీలు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. కాగా ఈ ఏడాది మే మూడో వారంలో బీరు, లిక్ర్‌ ధరలను 25శాతం మేర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది దుకాణాల సంఖ్య పెరడగంతో పాటు బెల్టు షాపులు కూడా భారీగా పెరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత రాష్ట్రంలో మూడుదఫాలుగా మద్యం ధరలను పెంచారు. అయితే డిస్టిలరీలకు చెల్లించే ప్రాథమిక ధరను ప్రభుత్వం పెంచకపోవడంతో డిస్టలరీలు కినుక వహించాయి. ఈఎన్‌ఐ కొరత పేరుతో చీప్‌ లిక్కర్‌ను కృత్రిమ కొరత సృష్టించాయి.

ర్కార్‌కు కొరత పేరుతో బెదిరింపులు…

ఇప్పటికే మూడు దఫాలుగా మద్యం ధరల పెరుగుదలతో మందు బాబులకు అదనపు భారం పెరిగింది. అయితే ఖజానాకు రాబడి పెరుగుదలలో పెద్దగా లాభం చేకూరలేదు. ఈ నేపథ్యంలో డిస్టలరీల ప్రతిపాదనలను ప్రభుత్వం ఒకవేళ పరిగణలోకి తీసుకొని ధరలు పెంచినా అది కూడా డిస్టలరీలకే ప్రయోజనకారి కానుంది. ఇష్యూ ప్రైస్‌ పెంచితే వారికే ఆ భారం మొత్తం లాభంగా మారనుంది. కేవలం పన్నుల రాబడి మాత్రమే సర్కార్‌ ఖజానాకు చేరనుంది. ఇదే జరిగితే మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. మద్యం ధరల పెంపు ఫైలు సీఎంకు చేరింది. దీంతో మద్యం ధరలు మరో 15 శాతం మేర పెంపునకు సర్కార్‌ సిద్దమవుతోందని తెలుస్తోంది. డిస్టిలరీలనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ఇష్యూప్రైస్‌ను పెంచాలని గత కొంత కాలంగా వస్తున్న డిమాండ్‌కు సర్కార్‌ ఆమోదం తెలిపే దిశగా పావులు కదులుతున్నాయని సమాచారం. ప్రతీ మూడేళ్లకోసారి మద్యం ధరలపై ప్రభుత్వం పున: సమీక్ష జరపడం ఆనవాయితీగా ఉంది. గతేడాది ఏపీలో మద్యం ధరలను సర్కార్‌ సవరించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఆ తర్వాత మూడు సార్లుగా మద్యం ధరలు పెరిగాయి. తాజాగా డిస్టలరీల ఒత్తిడితో మద్యం ధరల పెంపునకు సర్కార్‌ ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

నివేదిక ఇచ్చిన కమిటీ…

- Advertisement -

రాష్ట్ర ఏర్పాటు తర్వాత మధ్యం ధరల నిర్ణాయక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా మద్యం ధరలను మరో 15నుంచి 20 శాతం పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన్లు ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే డిస్టిలరీల లైసెన్సు రుసుములను రెండింతలు చేసిన నేపథ్యంలో వారికి ప్రయోజనం కలిగేలా ధరల పెంపునకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు బీర్‌, మద్యం ధరలను పెంచేందుకు రంగం సిద్దమైనట్లుగా అధికారులు తెలిపారు.

భారీ పెరుగుదల…

మద్యం కొనుగోలు రేటుగా పిలిచే ఇష్యూ ప్రైస్‌ను పెంచడం ద్వారా బేసిక్‌ ధరలో మార్పు రానుంది. దీంతో చీప్‌ లిక్కర్‌తోపాటు మీడియం, ప్రమీయం బ్రాండ్‌ల ధరలకు రెక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చౌక మద్యం ధరలను భారీగా తగ్గించగా, మిగతా రకం మద్యంపై పన్నురేటును పెంచడంతో ధరల్లో మార్పు వచ్చింది. కాగా తెలంగాణలో అన్ని రకాల మద్యం ధరలు ఇతీర పొరుగు రాష్ట్రాలకంటే తక్కువగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కర్నాటక, తమిళనాడు, ఢిల్లి, ఏపీల్లో మద్యం ధరలు తెలంగాణ కంటే తక్కువగా ఉండటంతోనే అక్కడినుంచి ఎన్‌డీపీ రాష్ట్రంలోకి వస్తుందని తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదించింది. పెరగనున్న మద్యం ధరలతో ప్రజలపై రూ. 2500 కోట్ల అదనపు భారం పడనుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement