Saturday, November 23, 2024

మదుపరుల సంపదను ఆవిరి చేస్తున్న ఎల్‌ఐసి షేర్లు

స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసి షేర్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. బొంబే స్టాక్‌ ఎక్సైంజ్‌లో షేర్లు లిస్ట్‌ అయిన రోజు నుంచి వరసగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. సోమవారం ఒక్క రోజే ఎల్‌ఐసి షేర్‌ విలువ రెండు శాతం తగ్గి, 786.05 రూపాయల వద్ద ముగిసింది. మార్కెట్‌లోకి వచ్చిన తరువాత ఇదే కనిష్ట స్థాయి. ఈ ఐదు రోజుల్లో 6 వాతానికి పైగా తగ్గింది.
ఎల్‌ఐసిలో 10 శాతం వాటాను విక్రయించడం ద్వారా 60 వేల కోట్లు సేకరించాలని తొలుత కేంద్రం భావించింది. ఉక్రేయిన్‌ యుద్ధం, కరోనా పరిస్థితుల మూలంగా 20,557 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై ఎన్నో విమర్సలు, అన్ని వర్గాల నుంచి గట్టి వ్యతిరేకత వ చ్చినా లేక్క చేయని కేంద్రం స్టాక్‌ మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. 2022 మే 4న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్‌ఐసీ షేర్ల కోసం మార్కెట్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. షేర్లు మూడు రేట్లు ఓవర్‌ సబ్‌ స్కైబ్‌ అయ్యాయి.
బీఎస్‌సిలో ఎల్‌ఐసి షేర్లు లిస్టింగ్‌ నుంచి తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటునే ఉన్నాయి. షేరు ఇష్యూ ధర 949 రూపాయలతో మే 17న బీఎస్‌సిలో లిస్ట్‌ అయింది. మార్కెట్లు బలహీనంగా ఉండటంతో తొలిరోజే 8 శాతం నష్టంతో షేర్లు లిస్టయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇష్యూ ధరతో పోల్చితే ఎల్‌ఐసిీ షేర్లు 17 శాతం నష్టపోయాయి. తొలిరోజే 949 ఉన్న షేర్‌ ధర 8 శాతం నష్టంతో 867.20 రూపాయలకు పడిపోయింది. దీంతో 42,500 కోట్లు నష్టపోయింది. దీంతో ఎల్‌సీ మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ 5,57,676 కోట్లకు పడిపోయింది. ఒక్కో షేరు 949 జారీ ధరతో మార్కెట్‌లోకి వచ్చిన సమయంలో ఎల్‌ఐసి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 6,00,242 కోట్లుగా ఉంది.

ఎల్‌ఐసి షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు 904 రూపాయలకు, పాలసీదారులకు 889 రూపాయలకు, సాధారణ ఇన్వెస్టర్లకు 949 రూపాయలకు షేర్లకు కేటాయించారు. పాలసీదారులకు రిజర్వేషన్‌ కింద ఒక్కొక్కరికి 15 షేర్లకు మించకుండా కేటాయించారు. సోమవారం నాడు ఈ షేర్లు 786 రూపాయల వద్ద ట్రేడ్‌ అయ్యాయి. అంటే అన్ని రకాల ఇన్వెస్టర్లకు ఈ షేర్లు భారీ నష్టాలకు గురి చేస్తున్నాయి. షేర్ల భారీ పతనంతో ఎల్‌ఐసి కూడా భారీగానే నష్టపోతోంది. సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దారుణంగా పడిపోతోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement