Tuesday, November 19, 2024

LIC బంపర్ ఆఫర్..

ఎల్ఐసీ ఇప్పుడు చౌక వడ్డీ రేటుకే రుణాలు ఇస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే వారికి ఇది సువర్ణ అవకాశంగా LIC చెబుతోంది. రూ.50 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇంకా తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ను సెప్టెంబర్‌ 30లోపు చెల్లించాలి అని కూడా తెలియజేయడం జరిగింది. కంపెనీ తాజా నిర్ణయంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.66 శాతానికి దిగొచ్చాయి. ప్రస్తుతం దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI హోమ్ లోన్స్‌పై 6.65 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఎల్‌ఐసీ హోమ్‌వై యాప్ ద్వారా లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఎల్‌ఐసీ హోమ్ లోన్స్‌ పై వడ్డీ రేటు సిబిల్ స్కోరు ప్రాతిపదికన మారుతుందని గమనించాలి. అలానే తీసుకున్న రుణాన్ని 30 ఏళ్ల లోపు చెల్లించొచ్చు.

ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకుంటున్న రెడీమేడ్ ఇల్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement