హైదరాబాద్ : పండుగ ఉత్సాహాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హైదరాబాద్లో తన ఇండియా కా సెలబ్రేషన్ ప్రచారంలో విజేతలను గర్వంగా ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా ఎల్జీ ఉత్పత్తులు కొనుగోలు చేసే కస్టమర్లకు ప్రత్యేకమైన ఎల్జీ డ్రీమ్ హోమ్ ప్యాకేజీ గెలుచుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గృహాలకు సంతోషాన్ని, విలాసాన్ని తీసుకువస్తూ 44మంది ఈ ప్రతిష్టాత్మక బహుమతిని గెలుచుకోగా, ఆరుగురు హైదరాబాద్ నుంచి గెలిచారు. పండుగ కాలంలో కస్టమర్ల కోసం ఉత్సాహాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఇండియా కా సెలబ్రేషన్ ప్రచారం ప్రారంభించబడింది. ఇందులో మొత్తం రూ.51 కోట్ల విలువైన బహుమతులను అందిస్తున్నారు.
ఈసందర్భంగా హైదరాబాద్ విజేతలను అభినందిస్తూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తెలంగాణ రీజియన్కి చెందిన రీజినల్ బిజినెస్ హెడ్ కె.శశి కిరణ్ రావు మాట్లాడుతూ… ఎల్జీగా, పండుగ సీజన్లో కుటుంబ ఆత్మీయతకు విలువ ఇవ్వడాన్ని, ఇండియా కా సెలబ్రేషన్ ప్రచారంలో భాగంగా తమ కస్టమర్ల సంతోషంలో భాగస్వాములవడాన్ని గుర్తిస్తున్నామన్నారు. తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గృహాలకు సంతోషం, సౌలభ్యాన్ని అందిస్తున్నందుకు తమ అభినందనలు, హైదరాబాద్ విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఇండియా కా సెలబ్రేషన్ ప్రచారం ప్రతిరోజూ డ్రీమ్ హోమ్ ప్యాకేజీని గెలిచే విజేతలను ప్రకటిస్తూ, పండుగ సంతోషాన్ని దేశవ్యాప్తంగా గృహాలకు తీసుకువస్తుందన్నారు.