Friday, November 22, 2024

HYD: వచ్చే ఐదేళ్ల‌లో 25-30శాతం వార్షిక అప్లికేషన్ వృద్ధిని లక్ష్యంగా చేసుకున్న లేహై యూనివర్శిటీ

హైదరాబాద్ : యునైటెడ్ స్టేట్స్‌, పెన్సిల్వేనియాలోని బెత్లెహెమ్‌లోని ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్శిటీ అయిన లెహై యూనివర్సిటీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎడ్-ఫిన్‌టెక్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన గ్రాడ్ రైట్ తో కలిసి నెక్స్ట్‌ఇన్‌టెక్ తొలి ఎడిషన్‌ను నిర్వహించాయి. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల అధికంగా పాల్గొన్నారు. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ లో తమ నైపుణ్యం ప్రదర్శించారు.

ఈ సందర్భంగా గ్రాడ్‌రైట్ సహ వ్యవస్థాపకుడు అమన్ సింగ్ మాట్లాడుతూ… తదుపరి తరం ఆవిష్కర్తలకు సాధికారత కల్పించేందుకు తమ నిబద్ధతను నెక్స్ట్‌ఇన్‌టెక్ సూచిస్తుందన్నారు. నెక్స్ట్‌ఇన్‌టెక్ లో భాగంగా పలు హ్యాకథాన్‌లు నిర్వహించారు. వీటిలో పాల్గొన్న వారు రూ.2 లక్షల బహుమతి కోసం పోటీ పడ్డారు. అలాగే మొదటి ముగ్గురు ఫైనలిస్టుల కోసం లెహై ఇండియా ఇన్నోవేటర్స్ అవార్డులు అందిస్తారు.

ఈ కార్యక్రమంలో అకాడెమియా, పరిశ్రమకు మధ్య వారధిగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రతిభ రేపటి శ్రామికశక్తిని ఎలా రూపొందిస్తుంది అనే అంశంపై ప్యానెల్ చర్చ లెహై యూనివర్శిటీకి చెందిన సబ్రినా జెడ్లికా, డా. కె.వి.ఎన్. సునీత, ప్రిన్సిపాల్, బివిఆర్ఐటి మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఐఐటి హైదరాబాద్ నుండి టి వి దేవీ ప్రసాద్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి రవిచంద్రన్ రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement