Thursday, January 16, 2025

PhonePe | ఆదమరిస్తే అంతే సంగతులు! డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి తెలుసుకోండి

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : బాధితులను మోసగిచ్చేందుకు సైబర్ నేరస్తులు భయపెట్టడం అనే అస్త్రాన్ని వాడుతున్నారు. బాధితులకు ఎలాంటి అనుమానం రాని విధంగా పోలీస్ లేదా ప్రభుత్వ అధికారుల్లాంటి చట్ట అమలు శాఖ అధికారులనిపించే తంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. చట్టపరమైన సమస్యల గురించి ప్రజల్లో ఉన్న భయాన్ని ఉపయోగించుకుని, డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనే తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.

హెచ్చరిక సంకేతాల గురించి సరిగ్గా తెలియనప్పుడు వారు మోసగాళ్ల బారిన పడేలా చేస్తోంది. ఇమెయిల్, టెక్స్ట్ సందేశాలు లేదా ఫోన్ మార్గాల ద్వారా పనిచేసే చట్ట అమలు శాఖ లేదా న్యాయ శాఖ అధికారులుగా మోసగాళ్లు చూపించుకుంటూ పరోక్ష మోసానికి పాల్పడడాన్ని డిజిటల్ అరెస్ట్ స్కామ్ అని అంటున్నారు.

ఆన్‌లైన్‌ నేరాలు లేదా సైబర్ నేరాలకు పాల్పడ్డారనే నెపంతో మీపై అరెస్ట్ వారెంట్ ఉందని, మీ వద్ద దర్యాప్తు జరపాలని వారు చెప్పుకొస్తారు. వెంటనే పేమెంట్ చేయాలని లేదా వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని వారు డిమాండ్ చేస్తారు. దీనికి కట్టుబడకుంటే అరెస్టు చేయాల్సి వస్తుందని కూడా పలు సందర్భాల్లో హెచ్చరిస్తారు.

డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడే వారు మీనుండి పేమెంట్ చేయించేలా లేదా సున్నితమైన సమాచారం సేకరించేలా మీకు కాల్స్, ఇమెయిళ్లు, టెక్స్ట్, సోషల్ మీడియా సందేశాలు లేదా చివరకు వీడియో కాల్స్, అలాగే పలు సందర్భాల్లో చట్ట అమలు శాఖ లేదా న్యాయ శాఖ అధికారులుగా నటించడం లాంటి వివిధ ఛానెళ్ల ద్వారా సంప్రదించడాన్ని ప్రారంభించడం ద్వారా మీకు భయం, ఒత్తిడి కలిగిస్తారు.

ఈ సందేశంలో నకిలీ ప్రభుత్వ సీల్స్ లేదా లోగోలు ఉండవచ్చు. అలాగే చట్టబద్ధమైన ఫోన్ నంబర్ నుండి వచ్చినట్టు కూడా కనిపించవచ్చు. మిమ్మల్ని సంప్రదించడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు లేదా మెసేజింగ్ సర్వీస్‌లను కూడా ఉపయోగించుకోగలరు.

- Advertisement -

పోలీస్ స్టేషన్ తెరవెనుక కనిపించేలా రూపొందించిన సెటప్ లో యూనిఫామ్ లు ధరించినట్టు కనిపిస్తూ వీడియో కాల్స్ నిర్వహించడం ద్వారా చట్ట అమలు శాఖ అధికారులుగా మోసగాళ్లు మాట్లాడుతారు. నేరపూరిత చర్యల్లో మీ ప్రమేయం ఉన్నట్టు తప్పుగా చెప్పడానికి వాళ్లు ఈ కుయుక్తిని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తారు. అరెస్టును నివారించడానికి వెంటనే పేమెంట్ చేయడమో లేదా సున్నితమైన సమాచారం అందించడమో చేయాలని వారు డిమాండ్ చేస్తారు.

నమ్మదగేవిధంగా నకిలీ కేస్ నంబర్లు లేదా చట్టబద్ధమైన పరిభాషలను చూపిస్తూ అనుమానాస్పద ఇంటర్నెట్ కార్యకలాపం లేదా మోసపూరిత లావాదేవీలు లాంటి ఉత్తుత్తిదే అయినప్పటికీ హెచ్చరికతో కూడిన నేరాలతో మీపైన దర్యాప్తు జరపాల్సి ఉందని వారు చెప్పవచ్చు.

అరెస్టు కావడాన్ని నివారించేందుకు, వెంటనే జరిమానా చెల్లించడం (పలు సందర్భాల్లో బయటకు కనిపించని విధంగా క్రిప్టో కరెన్సీ లేదా గిఫ్ట్ కార్డుల ద్వారా) లేదా వ్యక్తిగత సమాచారం అందించడం లాంటివి చేస్తారు. మీరు వారి చట్టబద్ధమైన అధికారాన్ని ప్రశ్నించడం లేదా వారి ఆదేశాలకు కట్టుబడడానికి సంశయిస్తే తదుపరి చట్టపరమైన చర్యలు ముందుకెళ్లకుండా లేదా జరిమానా పెరగకుండా చూసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఫోన్ పే సైబర్ రక్షణ నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను షేర్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా మిమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారని మీరు అనుమానిస్తే, ప్రశాంతంగా ఉంటూ, త్వరగా స్పదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, బాధితులను మోసపుచ్చేందుకు మోసగాళ్లు భయపెట్టడం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారు.

కమ్యూనికేషన్ చట్టబద్ధతను వెరిఫై చేసేందుకు, స్కామర్ అందించిన నంబర్ బదులు అధికారిక ఛానెళ్ల ద్వారా మీకు బెదిరింపు చేసినట్టు చెబుతున్న ఏజెన్సీని నేరుగా సంప్రదించండి. ఇలాంటి ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తే ఈ స్కామ్ లను ట్రాక్ చేసి, ఇతరులకు హెచ్చరిక చేసేందుకు సహాయపడేలా స్థానిక ప్రభుత్వ శాఖ అధికారులు లేదా వినియోగదారు రక్షణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేయండి.

పొరపాటుగా మీరు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తే, పాస్ వర్డ్ లను మార్చడం ద్వారా మిమ్మల్ని మీరు సంరక్షించుకునేందుకు సత్వర చర్యలు తీసుకోండి. అలాగే మీ వ్యక్తిగత సమాచారం బయటపడకుండా మీ బ్యాంక్ కు ఈ విషయంపై సమాచారం అందించండి. ఫిషింగ్ ప్రయత్నాలు, మాల్ వేర్ ల నుండి రక్షించుకునేలా మీ పరికరాలు తాజా సాఫ్ట్ వేర్ కలిగి ఉండేలా చూసుకోండి.

అదనపు భద్రత కోసం రెండు దశల ప్రామాణికతను (2ఎఫ్ఏ)ను అమలు చేయండి. చివరగా, సాధారణంగా జరిగే స్కామ్ యుక్తులు గురించి సమాచారం తెలుసుకుంటూ, ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులు, కుటుంబంతో షేర్ చేసుకోవడం ద్వారా ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా వారిని కూడా రక్షించడంలో సహాయపడవచ్చు.

ఫోన్ పే ద్వారా మీరు ఎవరైనా మోసగాడి వద్ద వంచనకు గురైతే, మీరు వెంటనే అలాంటి స్కామ్ గురించి ఫోన్ పే యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా కస్టమర్ కేర్ నంబర్ 080–68727374/ 022–68727374కు కాల్ చేయవచ్చు లేదా ఫోన్ పే అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఫిర్యాదు చేయవచ్చు.

చివరగా మీరు ఈ మోసపూరిత సంఘటనలపై ఫిర్యాదులను సమీప సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా హెచ్ టీటీపీఎస్ : // డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ.సైబ‌ర్ క్రైమ్ .జీఓవీ.ఇన్ / లో ఆన్‌లైన్‌ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు. లేదా సైబర్ నేరాల హెల్ప్ లైన్ ను 1930లో సంప్రదించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement