Tuesday, November 26, 2024

Layoffs | అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్‌!

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోమారు లేఆఫ్స్‌ కు తెరలేపింది. ఫార్మసీ యూనిట్‌లో కొందరు ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్‌, టీమ్‌ లీడ్స్‌ ఉన్నారు. అయితే, రిజిస్టర్‌ అయిన ఫార్మసిస్ట్‌ లను కంపెనీ తొలగించలేదని సమాచారం. తాజా లేఆఫ్స్‌ పై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘క్వాలిటీ, సామర్థ్యం కోసం మా ప్రాసెస్‌ ను నిరంతరం మెరుగుపర్చుకుంటాం. తద్వారా బెస్ట్‌ కస్టమర్‌ ఎక్స్‌ పీరియన్స్‌ కోసం కృషి చేస్తాం. తాజాగా అమెజాన్‌ ఫార్మసీ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాం. వనరులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.

- Advertisement -

కాగా, అమెజాన్‌ ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం మార్చిలో సీఈవో అండీ జస్సీ 9000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్‌ 18న అడ్వ్టంజింగ్‌ యూనిట్‌కు చెందిన పలువురు ఉద్యోగులను అమెజాన్‌ సాగనంపింది.ఈ ఏడాది మేలో మరో 500 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ జారీ చేసింది. తాజాగా ఫార్మసీ డివిజన్‌లోనూ లేఆఫ్స్‌ ప్రకటించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement