అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. సంస్థ నష్టాల్లో ఉన్నందున 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇది వరకే బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా 400 మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీస్‌లు జారీ చేసింది.
ఏరోస్పేస్ లేబర్ యూనియన్‌లోని 438 మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీస్‌లను అందించింది. వీరిలో 218 మంది ఇంజినీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయిస్ ఇన్ ఏరోస్పేస్ (ఎస్‌పీఈఈఏ) యూనిట్‌లోని సభ్యులు.
మిగిలిన వారు టెక్నికల్ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్న వాళ్లు, సాంకేతిక నిపుణులు, విశ్లేషనకులు ఉన్నారు. అర్హత ఉన్న ఉద్యోగులకు మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్, సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనుంది.