న్యూఢిల్లి: మన దేశ వాణిజ్యలోటు రికార్డ్ స్థాయిలో పెరిగింది. నెలవారి ఎగుమతులు, దిగుమతుల విషయంలో మే నెలలో భారీ వ్యత్యాసం నమోదైంది. మే నెలలో వాణిజ్య లోటు 23.33 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన ఎగుమతులు 37.3 బిలియన్ డాలర్లతో 15.5 శాతంగా ఉన్నాయి. దిగుమతులు 60.62 బిలియన్ డాలర్లతో 56.1 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత నవంబర్‌లో అత్యధికంగా వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ రకాల సరకుల ఎగుమతులు 7.2 శాతం తగ్గి, 40.19 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో వాణిజ్యలోటు 41.73 బిలియన్ డాలర్లు అయ్యింది. ఏప్రిల్ , మే నెలలో ఇది 21.82 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మన దేశం నుంచి జరిగిగే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 52.7 శాతం తగ్గిపోయాయి.
ఎలక్ట్రానిక్స్ 41.5 శాతం, టెక్స్‌టౖౖెల్స్ గార్మెంట్స్ 22.9 శాతం నమోదు కావడంతో ఎగుమతుల వృద్దికి తోడ్పాటు ఇచ్చాయి. వరసగా మూడు నెలల పాటు మన చమురు దిగుమతులు 60 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు కూడా ఈ కాలంలో బాగా పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 1.7 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతులు జరిగితే, మే నెలలో ఇది మూడింతలు పెరిగి 5.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలానే ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రతి నెల వాణిజ్యలోటు 20 నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచాన వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.