Saturday, November 23, 2024

భారీగా పెరిగిన వాణిజ్యలోటు.. స్వల్పంగా పెరిగిన ఎగుమతులు

మన దేశ ఎగుమతులు ఆగస్టు నెలలో 1.62 శాతం పెరిగి 33.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు మాత్రం 37.28 శాతం వృద్ధితో 61.9 బిలియన్‌ డాలర్లుకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు రెండింతలకు పైగా పెరిగింది. ఈ లోటు 27.98 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2021 ఆగస్టులో వాణిజ్యలోటు 11.71 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టులో దేశీయ ఎగుమతులు 17.68 శాతం పెరిగి 193.51 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ఇదే సమయంలో దిగుమతులు కూడా 45.74 శాతం పెరిగి , 318 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్యలోటు 124.52 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 53.78 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement