ఇటలీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ లంబోర్గిని సోమవారం కీలక ప్రకటన చేసింది. భారత్ మార్కెట్లో 400 లంబోర్గిని అమ్మకాల మార్క్‌ను తాము అధిగమించినట్టు తెలిపింది. 2007 నుంచి పూర్తి స్థాయిలో భారత్‌లో సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చింది. లంబోర్గినీ ఇండియా చీఫ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత్‌లో ఇప్పటి వరకు 400 లంబోర్గినీ కార్లను విక్రయించడం సంతోషంగా ఉందన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చామని ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదని వివరించారు. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, వారి మద్దతుతోనే ఈ ఘనత సాధించామని చెప్పుకొచ్చారు.
లంబోర్గినీ కార్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఎంతో మంచి అనుభవాన్ని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా కూడా ఉందన్నారు. భారతదేశంలో లంబోర్గినీ బ్రాండ్‌కు ఎంతో ఆదరణ లభించిందని, రాబోయే కస్టమర్‌లు మరింత మంచి అనుభవం పొందేందుకు ప్రత్యేకమైన ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసేందుకు కంపెనీ నిర్ణయించిందని తెలిపారు. లంబోర్గినీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు గాను.. సూపర్ లగ్జరీ కార్ల విభాగంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నందుకు గాను.. లంబోర్గినీ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో లంబోర్గినీ డే మూడో ఎడిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.