Friday, November 22, 2024

వడ్డీ రేట్లు పెంచిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ డిపాజి టర్లకు, సీనియర్‌ సిటిజన్లకు కూడా సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ తెలిపింది. కనిష్ట వడ్డీ రేటు 2.75 శాతం, గరిష్ట వడ్డీ రేటు 6.30 శాతం వరకు ఉంటాయని బ్యాంక్‌ తెలిపింది. సీనియర్‌ సిటిజన్లకు అన్ని ఎఫ్‌డీలపై 0.50 శాతం అదనపు వడ్డీ పొందుతారని పేర్కొంది. వీరికి గరిష్టంగా 6.80 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. పెంచిన రేట్లు నవంబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది.ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో అన్ని బ్యాంక్‌లు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి.

యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం

యాక్సిస్‌ బ్యాంక్‌ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితితో చేసే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్‌ సిటిజినట్లకు 3.5 శాతతం నుంచి 7.25 శాతం వరకు పెంచింది. పెంచిన రేట్లు నవంబర్‌ 5వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది. మూడు నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధిలో చేసే డిపాజిట్లపై ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. 6 నుంచి 9 నెలల కాల వ్యవధిలో చేసే డిపాజిట్లపై బ్యాంక్‌ 5 నుంచి 5.50 శాతం వరకు వడ్డీరేటును పెంచింది. 9 నుంచి 12 నెలల కాలవ్యవధిలో చేసే డిపాజిట్లపై బ్యాంక్‌ 5.75 శాతానికి వడ్డీరేటును పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement