హైదరాబాద్: ఎడ్యుస్కిల్స్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ర్యాంకింగ్స్ 2024లో అసాధారణమైన ప్రదర్శనను చేసినట్లు కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వెల్లడించింది. ఈ విశ్వవిద్యాలయం అధునాతన ఇంటర్న్‌షిప్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా డిజిటల్ వర్క్‌ఫోర్స్ ఆఫ్ టుమారో ని నిర్మించటంలో అందించిన తోడ్పాటుకు గానూ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లను పొందింది, దాని విజయవాడ క్యాంపస్‌కు 4వ స్థానం, హైదరాబాద్ క్యాంపస్‌కు 7వ స్థానం సాధించింది. వైస్ ఛాన్సలర్ ఎక్సలెన్స్ అవార్డును కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డాక్టర్ జి.పి.ఎస్ వర్మ అందుకున్నారు. డీన్ ఎక్సలెన్స్ అవార్డును డీన్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, డాక్టర్ ఎ.శ్రీనాథ్ అందుకున్నారు.
ప్రిన్సిపల్ ఎక్సలెన్స్ అవార్డుతో కెఎల్ హెచ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకెళ్ల రామకృష్ణను సత్కరించారు. ఉత్తమ సెంటర్ కోఆర్డినేటర్ అవార్డును డాక్టర్ వి వర ప్రసాద్ అందుకున్నారు. ఉత్తమ రచయిత, సలహాదారు అవార్డు డాక్టర్ కె శ్రీనివాస్‌కు లభించింది. ఇంకా ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్.ఎస్ శ్రీథర్ ఎడ్యుకేటర్ ఎక్సలెన్స్ అవార్డ్ (ఏడబ్ల్యుఎస్ అకాడమీ) – 2024 (సౌత్ సెంట్రల్ జోన్) అందుకున్నారు. అదనంగా, విద్యార్థి మారా లోకేష్ ఎన్ శ్రీ ప్రభు సూర్య, జునిపర్ నెట్‌వర్క్స్ నుండి పూర్తి-సమయ ఉపాధి ఆఫర్‌లను పొందారు. దీనిని అవార్డుల వేడుకలో ఏఐసిటిఈ చైర్మన్ అండ్ జునిపర్ నెట్‌వర్క్స్ సీఈఓ అందించారు.
ఈసందర్భంగా కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా.జి.పార్ధసారధి వర్మ మాట్లాడుతూ… తమ విద్యా, వృత్తిపరమైన ప్రదర్శన పరంగా ప్రతి అంశంలో శ్రేష్ఠతను సాధించడానికి తమ విద్యార్థులు, అధ్యాపకులు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావాన్ని ఈ ప్రశంసలు ప్రతిబింబిస్తాయన్నారు. కెఎల్ హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రామకృష్ణ తన సంతోషాన్ని పంచుకుంటూ… ఈ ప్రశంసలు తమ విశ్వవిద్యాలయానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయన్నారు. తమ విద్యా విషయాల్లో మరింత ఉన్నత లక్ష్యాన్ని సాధించేలా ప్రోత్సహిస్తాయన్నారు. అటువంటి విశిష్ట వేదికపై వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లలో తమ ప్రయత్నాలకు గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.