Tuesday, November 26, 2024

HYD | ఏసీఎం సదస్సులో సాంకేతిక నిపుణులను ఒకచోట చేర్చిన కెఎల్‌హెచ్‌ బాచుపల్లి

హైదరాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ) : కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ ఇటీవల ఏసీఎం ఇండియా రీజినల్ చాప్టర్ సమ్మిట్‌ను నిర్వహించింది. ఆవిష్కరణ, చర్చ, నెట్‌వర్కింగ్ కోసం శక్తివంతమైన వేదికను ప్రోత్సహించడానికి కంప్యూటింగ్‌లో మేధావులు, ప్రభావవంతమైన నాయకులను ఒకచోట చేర్చింది. కంప్యూటింగ్ కమ్యూనిటీలో పురోగతి, భాగస్వామ్యాలను ప్రోత్సహించటం ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఒరకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ నుంచి మరియా జోసెఫా చౌదరి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ యోగేష్ సింహన్, ఎస్ఆర్ఎం లోని స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఛైర్‌పర్సన్ రేవతి వెంకటరామన్, ఏసీఎం ఇండియా సీఓఓ డిజిగ్నేట్, రంగ రాజగోపాల్, ఐఐఐటి హైదరాబాద్ నుంచి పొన్నురంగం (పీకే) కుమారగురు, ఏసీఎం ఇండియా కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వెంకటేశ్వరన్ ఆర్. ప్రత్యేక అతిథి సచిన్ లోధా కూడా తన విలువైన నైపుణ్యాన్ని అందించి చర్చలను మరింత ఆసక్తిగా మలిచారు.

ఈ సంద‌ర్భంగా కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్ధ సారధి వర్మ మాట్లాడుతూ… యూనివర్శిటీ వద్ద తాము సహకారం, ఆవిష్కరణల శక్తిని జ్ఞానానికి అత్యంత కీలకంగా విశ్వసిస్తున్నామన్నారు. ఈ తరహా సదస్సును నిర్వహించడం వలన విద్యార్థులకు వారి రంగాల్లో వ్యక్తీకరణకు వేదిక లభించటంతో పాటుగా, పరిశ్రమ అనుభవం లభిస్తుందన్నారు. సమాజానికి విపరీతమైన సహకారం అందించేలా భవిష్యత్తు నాయకులను శక్తివంతం చేసే త‌మ మిషన్‌కు అనుగుణంగా ఇది ఉంటుందన్నారు.

కెఎల్‌హెచ్‌లో ఏసీఎం స్టూడెంట్ చాప్టర్ ప్రెసిడెంట్ బొబ్బా తంబి ఆశిష్ మాట్లాడుతూ… ఈ సదస్సు విద్యార్థులుగా పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలతో నేరుగా సంభాషించడానికి త‌మకు ఒక అద్భుతమైన అవకాశమ‌న్నారు. ఇది ప్రస్తుత కంప్యూటింగ్ ల్యాండ్‌స్కేప్‌పై త‌మ అవగాహనను విస్తృతం చేయడమే కాకుండా, ఈ రంగానికి త‌మ భవిష్యత్ సహకారాల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, ఆవిష్కరణలు చేయడానికి త‌మకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement