Tuesday, November 26, 2024

కియా సోనెట్‌ 1.5 లక్షల యూనిట్ల అమ్మకం.. రెండేళ్లలోనే ఈ ఘనత

ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురంలో ఉత్పత్తి ప్లాంట్‌ ఉన్న కియా మోటార్స్‌ తన బ్రాండ్‌ సోనెట్‌ కార్ల అమ్మకాలు 1.5 లక్షల మార్క్‌ను అధిగమించాయి. ఈ మోడల్‌ ఎస్వీయూ కారును 2020 సెప్టెంబర్‌ లో మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జూన్‌ వరకు వీటి అమ్మకాలు 1.5 లక్షలు దాటాయి. మొత్తం కంపెనీ అమ్మకాల్లో సోనెట్‌ వాటా 32 శాతంగా ఉంది. ఈ సిగ్మెంట్‌లో అన్ని కంపెనీల వాహనాల అమ్మకాల్లో సోనెట్‌ వాటా 15 శాతంమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కియా ఇండియా ఉత్పత్తి చేస్తున్న వాటిలో టాప్‌ ఎండ్‌ కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. మొత్తం అమ్మకాల్లో ఇవి 26 శాతం ఉన్నాయి. 44 శాతం మంది కొనుగోలుదారులు ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్లను ఇష్టపడుతున్నారు. డీజిల్‌ ఇంజన్‌ కార్లకు మంచి డిమాండ్‌ ఉందని తెలిపింది. సోనెట్‌ కార్లతో ఈ ఏప్రిలక్ష నాలుగు ఎయిర్‌ బ్యాగ్స్‌ను అదనంగా ఏర్పాటు చేశామని, దీని వల్ల రక్షణ మరింత మెరుగుపడుతుందని కంపెనీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement