ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో కియా సోనెట్ ఒకటి. కాగా, ఈ ఎస్‌యూవీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 14న ఆవిష్కరించనుంది కంపెనీ. ఈ కొత్త అప్‌డేట్ తో సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే ఈ కొత్త మోడల్… టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి వాటితో పోటీగా వస్తోంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ స్పెషిఫికేషన్లు :
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌లో అనేక వివరాలను రివీల్ చేసింది. ముఖ్యంగా వెహికల్ ముందు డిజైన్, గ్రిల్ రీడిజైన్ ఆకర్షణీయంగా ఉండనుంది. ప్రతి యూనిట్‌లో 3 ఎల్ఈడీలను కలిగిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. డీఆర్ఎల్, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ యూనిట్లు, బంపర్ కూడా రీస్టోర్ చేయనుంది.
ధర ఎంత ఉండొచ్చుంటే? :
క్యాబిన్‌లోని ప్రధాన మార్పులలో 2023 కియా సెల్టోస్‌లో చూసినట్లుగానే సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అప్‌డేట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 360-డిగ్రీ కెమెరాతో రావొచ్చు. మరో ముఖ్యమైన అప్‌డేట్ ఏడీఏఎస్ టెక్ ఇప్పటికే హ్యుందాయ్ వెన్యూలో ఉంది.
హుడ్ కింద, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 3 ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 83హెచ్‌పీ, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 120హెచ్‌పీ, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 116హెచ్‌పీ, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు ఈ పవర్‌ట్రెయిన్‌లు ప్రస్తుత ట్రాన్స్‌మిషన్ పెయిర్స్ అలాగే ఉంచుతాయని భావిస్తున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ఉంటుంది.
టర్బో-పెట్రోల్ 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఉండవచ్చు. భారత మార్కెట్లో కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.