కియా మోటార్స్ రెండు కాన్సెఫ్ట్ విద్యుత్ కార్లను ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లో జరుగుతున్న ఆటో షోలో వీటిని ప్రదర్శించింది. కంపెనీ ఈవీ3 పేరుతో కంపాప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని, ఈవీ4 పేరుతో ఎలక్ట్రిక్ సిడాన్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ కార్ల ధర, రేంజ్, బ్యాటరీకి సంబంధించిన వివరాలు, కార్ల టాప్ స్పీడ్ వంటి విషయాలను వెల్లడించలేదు. కియా మోటార్స్ రానున్న కాలంలో విద్యుత్ వ్యాన్లను కూడా ప్రవేశపెట్టనుందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. 2021లో కియా లాస్‌ఎంజెల్స్‌లో జరిగిన ఆటో షోలో ప్ర్‌దర్శించిన ఈవీ9 కన్సెప్ట్ కారు ప్రదర్శించింది. ఈ కారును రెండు సంవత్సరాల తరువాత గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఇండియాలో ఇది ఈవీ6 పేరుతో వచ్చింది. కియా ఈవీ3, ఈవీ4 ధరలు 35 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని ఆటో ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.