Tuesday, November 26, 2024

భారత్‌ మార్కెట్లోకి కియా ఎలక్ట్రిక్‌ కారు.. ఎస్యూవీ మోడల్లో రానుంది..

కియా మోటార్స్‌కు చెందిన తొలి ఎలక్ట్రిక్‌ కారు భారత్‌ మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. కియా ఈవీ-6 పేరుతో కియా ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్లోకి విడుదల కానుంది. ఎస్‌యూవీని పోలి ఉన్న ఈ కారు ముందు భాగం క్లామ్‌షెల్‌ బానెట్‌, స్లిమ్‌ గ్రిల్స్‌తో రూపొందించారు. కారు వెనుకభాగంలో లైట్‌బార్‌ టెయిల్‌ లైట్లు, అల్లాయ్‌రిమ్‌లు, రేక్డ్‌ ఫ్లోటింగ్‌ రూఫ్‌లైన్‌, వీల్‌ ఆర్చ్‌ల బాడీ క్లాడింగ్‌ డిజైన్‌తో ఉంది. ఈవీ6 కారు 4695ఎంఎం పొడవు, 1890ఎంఎం వెడల్పు, 1545ఎంఎం ఎత్తుతో వీల్‌బేస్‌ 2900 ఎంఎంగా ఉంది. కాగా కియా మొత్తం 5వేరియంట్లలో ఈవీ6ని అందించనుంది.

తొలి కారు 58 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో, వెనుక చక్రాలకు 170హార్స్‌పవర్‌తో సపోర్టు చేస్తుంది. ఈవీ6 800వోల్డ్‌ వేగవంతమైన ఛార్జింగ్‌ సిస్టమ్‌తో రానుంది. ఇది కేవలం 18నిమిషాల్లో 10శాతం నుంచి 80శాతానికి ఛార్జ్‌ అయ్యేందుకు సపోర్ట్‌ చేస్తుంది. అదేవిధంగా 11గంటల్లో పూర్తిగా చార్జ్‌ అయ్యేలా 7కేడబ్ల్యూ ఛార్జింగ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది విడుదలయ్యే ఈ కారు ధర రూ.60లక్షలుగా ఉండనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement