కియా ఇండియా కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 3 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగినందునే ధరలు పెంచుతున్నట్లు కియా ఇండియా నేషనల్ హెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ సంవత్సరం కార్ల ధరలు పెెంచడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. కస్టమర్లకు ప్రీమియం, టెక్నిలక్‌గా అధునాత వాహనాలను అందించడానికి కంపెనీ కృషి చేస్తుందని చెప్పారు. కియా ఇండియా ప్రస్తుతం సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మోడల్ కార్లను విక్రయిస్తోంది. భారత్‌తో పాటు, విదేశీ మార్కట్లలో కియా ఇండియా ఇప్పటి వరకు 1.16 మిలియన్ యూనిట్లను విక్రయించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement