గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం తీవ్ర దుమారం రేపుతుండగా.. తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అదానీ గ్రూప్‌తో చేసుకున్న 736 మిలియన్ డాలర్ల ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా ప్రభుత్వం వెల్లడించింది.
విమానాశ్రయం నిర్మాణం, ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కోసం కెన్యాకు చెందిన అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. చం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ డీల్‌లో భాగంగా అదానీ గ్రూప్ ఈ ఎయిర్‌పోర్టును 30 సంవత్సరాల పాటు నిర్వహించనుంది. అయితే, ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కెన్యాలోనూ, నైరోబీలోనూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎయిర్ పోర్టు కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ ఒప్పందం దేశానికి నష్టమని, ఉద్యోగాలు పోతాయని వీరు ఆందోళన వ్యక్తం చేశారు.