Saturday, September 14, 2024

Dr. Aggarwal’s Eye Hospital | కాకినాడలో నూతన కంటి ఆసుపత్రి….

  • ఈ ఆసుపత్రి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంది మరియు అధునాతన కంటి సంరక్షణ నమూనాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
  • ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆగస్టు 31, 2024 వరకు ప్రతి ఒక్కరికి ఉచిత కన్సల్టేషన్ లను ఆసుపత్రి అందిస్తోంది

కాకినాడ, : భారతదేశంలోని ప్రముఖ కంటి సంరక్షణ కేంద్రాల నెట్‌వర్క్ అయిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, నగరంలో తమ కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా కాకినాడలో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ నూతన ఆసుపత్రిని నేడు ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులలో : వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, కాకినాడ నగర నియోజకవర్గం, పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గం నిమ్మకాయల చినరాజప్ప, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నారు.

విశాలమైన 9,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో భానుగుడి జంక్షన్‌లో ఉన్న ఈ నూతన ఆసుపత్రి, సమర్థవంతమైన రోగ నిర్ధారణ, చికిత్సను నిర్ధారించే కంటి సంరక్షణ నమూనాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రారంభోత్సవాన్ని వేడుక చేసుకోవటంలో భాగంగా, ఆసుపత్రి సందర్శకులందరికీ ఆగస్టు 31, 2024 వరకు ఉచిత కన్సల్టేషన్ లను అందిస్తోంది.

కాకినాడలోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అన్ని కంటి సంరక్షణ అవసరాలకు సమగ్ర పరిష్కారంగా ఉపయోగపడుతుంది. వీక్షణ గ్యాలరీతో కూడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్, పీడియాట్రిక్, కార్నియల్ కేర్ కోసం ప్రత్యేక యూనిట్లు, ఆప్టికల్ డిస్‌ప్లే, ఆన్-సైట్ ఫార్మసీతో సహా సమగ్ర సేవలను అందించే యంత్రాంగము కలిగి ఉంది.

- Advertisement -

కందుల దుర్గేష్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ… “కాకినాడలో డాక్టర్ అగర్వాల్ కొత్త ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉంది. డ్రై ఐస్, మయోపియా వంటి కంటి సమస్యలు అన్ని వయసుల వారిని, ముఖ్యంగా పాఠశాల పిల్లలను ప్రభావితం చేస్తున్నందున, ఈ ఆధునిక సదుపాయం చాలా కీలకమైనది. ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన సాంకేతికతలు మరియు చికిత్సలను పరిచయం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని కంటి సంరక్షణ మౌలిక సదుపాయాలు భారతదేశంలోనే అత్యుత్తమమైనవని నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. నేత్ర సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపడుతోంది. డాక్టర్. అగర్వాల్ వంటి ఆసుపత్రులు కంటి సంరక్షణను విస్తరించడం మరియు మెరుగుపరచడం అనే మా లక్ష్యాలకు అనుగుణంగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన మరియు ప్రాముఖ్యతను పెంచడానికి మనమంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు

డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, సిఓఓ , రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నమైన కంటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడంలో మా అంకితభావం తిరుగులేనిది.గుంటూరు, మదనపల్లి, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఇప్పటికే మేము విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాకినాడలోని మా తాజా ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజలకు కంటి సంరక్షణ ను మరింతగా అందుబాటులోకి తీసుకురావటం , సామర్థ్యం మెరుగుపరచడం మరియు ఖచ్చితత్వాన్ని పెంపొందించాలనే మా మిషన్‌లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్‌లో కంటి సంరక్షణను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నందున, మేము ఆగస్టు 31 వరకు కాకినాడ లో అందరికీ ఉచిత సమగ్ర కంటి పరీక్షను అందిస్తున్నాము అని అన్నారు.

డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌లోని క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ జేమ్స్ సుబ్రత్ కుమార్ ఆడమ్స్ మాట్లాడుతూ ” కారుణ్య సంరక్షణతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేయటం ద్వారా మెరుగైన సేవలను అందించటం పైనే మా దృష్టి ఉంటుంది. ఈ కొత్త సదుపాయం క్లినికల్ సేవలలో మా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది, అందుబాటులో ఉన్న అత్యున్నత స్థాయి నేత్ర సంరక్షణను మా రోగులు పొందగలరని భరోసా అందిస్తుంది. ఈ సదుపాయం స్థానిక సమాజంలో కంటి ఆరోగ్యం మరియు నివారణ చర్యల గురించి అవగాహన కల్పించడం చేస్తుంది. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు మరియు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేసేందుకు విద్యా కార్యక్రమాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ కంటి సంరక్షణ శిబిరాలు నిర్వహించబడతాయి” అని అన్నారు.

కాకినాడ ఆసుపత్రికి నాయకత్వం వహిస్తున్న క్యాటరాక్ట్ సర్జన్ మరియు యువియా & రెటినా కన్సల్టెంట్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, మరియు కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్, క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ మహ్మద్ అజర్ చిస్తీ లు మాట్లాడుతూ కొత్త ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు మరియు ఆప్టోమెట్రిస్టుల బృందంతో పాటు, ఆప్టీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడిక్స్, కౌన్సెలర్లు మరియు పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన సమర్థ బృందం కలిగి ఉన్నామన్నారు. అందువల్ల , ఈ హాస్పిటల్ ప్రధానమైన కంటి ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన పరీక్షలు మరియు చికిత్సను అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement