Monday, November 25, 2024

అభిమానుల క‌ళ్లు మిరుమిట్లు గొలిపిన కే-పాప్ కాంటెస్ట్-2024 గ్రాండ్ ఫినాలే

హైద‌రాబాద్, (ఆంధ్రప్రభ ) : ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా), కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో, ఆల్-ఇండియా కే-పీఓపీ కాంటెస్ట్ 2024 మూడవ సంచికను ధగధగాయమానమైన గ్రాండ్ ఫినాలేతో ముగించింది.

ఈ సంచికలో భారతదేశం, కొరియా దేశాల మధ్య పరిఢవిల్లుతున్న సాంస్కృతిక సంబంధాలు, అసామాన్యమైన టాలెంట్ లను వేడుకగా జరుపుకుంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను గడించిన కే-పీఓపీ బ్యాండ్ ఎల్ యూఎన్ 8 వారు ప్రదర్శించిన కార్యక్రమం ఆ సాయంత్రం జరిగిన కార్యక్రమానికే తలమానికం.

ఈసంద‌ర్భంగా విజేతలను అభినందిస్తూ ఎల్జీ ఎల‌క్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ హోంగ్ జూ జియోన్ మాట్లాడుతూ… ఆల్-ఇండియా కే-పీఓపీ కాంటెస్ట్ 2024 గ్రాండ్ ఫినాలేలో అసాధారణమైన టాలెంట్, ఉద్వేగం, అంకితభావం కనపించిందన్నారు. పాల్గొన్న ప్రతి అభ్యర్ధి, వేదిక మీద విభిన్నతను ప్రదర్శించారు.

వారు ప్రదర్శించిన అంశాలు కే-పీఓపీ స్ఫూర్తికి నిజంగా అద్దం పట్టాయన్నారు. విజేతలైన ద ట్రెండ్, అభిప్రియా చక్రబర్తి లకు, వారు సాధించిన విజయానికి గాను త‌న హృదయ పూర్వక అభినందలను తెలియజేస్తున్నానన్నారు. వారి కృషి, సృజనాత్మకత, నిజంగా అభినందనీయమైనవి.

ఇండియాలో కొరియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ హువాంగ్ ఇల్ యోంగ్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు.. భారతీయ అభిమానుల నుండి ఉత్సాహంతో కూడిన సహాయం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కే-పీఓపీకి అద్భుతమైన ఆప్యాయాభిమానాలు లభించటంతో, తాము గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నామన్నారు. త‌మ భారతీయ అభిమానుల కోసం మరింత అద్భుతమైన వేదికను అందిస్తూ మళ్ళీ వచ్చే ఏడాది తిరిగి రావాలని తాము ఆశిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement