ఇండియా సిమెంట్స్‌కు చెందిన రెండు తయారీ యూనిట్లను కొనుగోలు చేసిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ మరో రెండు కొత్త తయారీ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందు కోసం 3,200 కోట్ల రూపాయాల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్స్‌లో ఏటా 5 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉప్పత్తి చేయనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో సిమెంట్ ఉత్పత్తి కేంద్రాన్ని, ఉత్తరప్రదేశ్‌లో స్ల్పింట్ గ్రైండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ తయారీ సామర్ధ్యం ఏటా 17 మిలియన్ టన్నులుగా ఉంది. 2023 చివరి నాటికి ఇది 20 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది.
ఇండియా సిమెంట్స్‌కు చెందిన 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న మధ్యప్రదేశ్ ప్లాంట్‌ను, రాజస్థాన్‌లోని యూనిట్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ల కొనుగోలుకు ఆల్ట్రాటెక్ ఇచ్చిన ఆఫర్ కంటే జేఎస్‌డబ్ల్యూ మెరుగైన ప్యాకేజీ ఇచ్చినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.