Thursday, November 21, 2024

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌బేబీ పౌడర్‌ గుడ్‌బై !

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ను కంపెనీ నిలి పివేయనుంది. చిన్నారుల కోసం వాడే ఈ టాల్కమ్‌ పౌడర్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. మార్కెట్‌లో ఎన్నో కంపెనీల పౌడర్లు వచ్చినా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ను ఢీకొనలేకపోయాయి. చిన్నారుల టాల్కమ్‌ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయన్న ఆరోపణ లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీ వచ్చే సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ పౌడర్‌ ఉత్పత్తి, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, కెనడాలో ఈ పౌడర్‌ అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. టాల్కమ్‌ పౌడర్‌ బదులుగా మొక్కజొన్న పిండిని వాడాలని కంపెనీ నిర్ణయించింది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న తమ టాల్కమ్‌ పౌడర్‌ పూర్తి సురక్షితమైనదని కంపెనీ స్పష్టం చేసింది. అయినప్పటికీ మారుతున్న పరిస్థితులు , ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అమ్ముతున్న టాల్కమ్‌ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇందులో ఉపయోగించే ఆస్‌బెస్టాస్‌ క్యాన్సర్‌కు కారకంగా ఉందని అనేక పరిశోధనలు సైతం స్పష్టం చేశాయి. కేసుల మూలంగానే 2020లో అమెరికా , కెనడాల్లో వీటి అమ్మకాలు కంపెనీ నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement