Tuesday, November 26, 2024

Jobs- బీహెచ్ఈఎల్ ఉద్యోగ‌కావ‌శాలు…న‌వంబ‌ర్‌25న ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 75సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు. సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్‌ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ 25 దరఖాస్తుకు చివ‌రి గ‌డువుగా నిర్ణయించారు.


ఖాళీగా ఉన్న పోస్టుల్లో జనరల్-36, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-10, ఎస్సీ-07, ఎస్టీ-06. పోస్టులు కేటాయించారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిచేస్తారు. ఎంపికైన వారికి ఎంపికైనవారికి శిక్షణ కాలంలో రూ.32,000 – రూ.1,00,000 (బేసిక్ పే రూ.32,000) చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.33,500-రూ.1,20,000 (బేసిక్ పే రూ.33,500) చెల్లిస్తారు. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా రూ.795. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement