దేశంలో టాప్ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులుగా ఉన్న కంపెనీల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గనున్నాయి. ఇలాంటి కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లోనే ఈ ఆర్ధిక సంవత్సరం కనీసం 50 వేల ఉద్యోగ నియామకాలు తగ్గుతాయని అంచనా వేశారు. ఈ కంపెనీలు గత సంవత్సరం 70 వేల మంది ఉద్యోగులును తీసుకున్నాయి.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్మ మూలంగా డిమాండ్ పెరగడంతో ఈ టెక్ కంపెనీలు 1,50,000 మందిని తీసుకున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో అంతర్జాతీయ పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు గ్లోబల్ టెక్నాలజీ సర్వీస్‌లకు గడ్డు పరిస్థితులకు కారణమని ఇండస్ట్రీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి టెక్నాలజీ రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనం, అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులతో టెక్నాలజీ కంపెనీల డిమాండ్ తగ్గిపోయింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే టెక్నాలజీ కంపెనీలు 2-4 శాతం ఉద్యోగుల నియామకాలు తక్కువగా చేసే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్. సి అభిప్రాయపడ్డారు.
దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ రెండోత్రైమాసిక ఆర్ధిక ఫలితాల వెల్లడించిన సందర్బంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో కాలేజీ క్యాంప్‌ల నుంచి రిక్రూట్మెంట్లను నిలి పివేస్తున్నట్లు ప్రకటించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ కూడా కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకోవడాని ్న తగ్గించుకోవాలని నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో టాప్ 3 ఐటీ కంపెనీల్లోనే కనీసం 50 వేల మంది కొత్త ఉద్యగాల రిక్రూట్మెంట్ తగ్గిపోనుంది.
మొత్తంగా చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు 4 శాతం వరకు తగ్గిపోనున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ బాటలోనే మిగిలిన ఐటీ కంపెనీలు కూడా కొత్త వారిని తీసుకునే విషయంలో నిర్ణయంచుకుంటే కనీసం ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల ఐటీ కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిలిచిపోనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి.
దీని ఫలితంగానే కంపెనీలు కొత్త వారిని నియామించుకునే విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితి 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 9 లక్షల మంది విద్యార్ధులు ఇంజినీరింగ్ పూర్తి కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో ఏటా కనీసం 2 లక్షల మందిని ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ రిస్క్‌లో పడినట్లేనని ప్రముఖ రిక్రూటింగ్ సంస్థ జీఫోనీ సహా వ్యవస్థాపకుడు కమల్ క్రాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్ధిక సంవత్సరం మిగిలిన త్రైమాసికాల్లోనూ ఐటీ కంపెనీలు దాదాపు కొత్త రిక్రూట్మెంట్లు చేసే పరిస్థితుల్లో లేవని టీమ్ లీజ్ డిజిటల్‌కు చెందిన సునీల్ చెప్పారు. కొన్ని ఐటీ కంపెనీలు పెద్ద ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, వీటికి పెద్దగా కొత్త ఉద్యోగుల అవసరం లేకుండానే, ఈ ఒప్పందాలను పూర్తి చేసే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.
సంవత్సరం క్రితం కూడా ఐటీ కంపెనీలు భారీగానే ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో టాప్ 3 ఐటీ కంపెనీలు రెండు శాతం ఉద్యోగులను తక్కువగా రిక్రూట్ చేసుకున్నాయి. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 4.2 శాతం కొత్త ఉద్యోగులను తగ్గించుకుంది.
టీసీఎస్ 1శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2 శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను తగ్గించుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రానున్న కాలంలో రిక్రూట్మెంట్ గైడెన్స్‌ను మరింత తగ్గించుకుంది. గత 20 సంవత్సరాల్లో ఇంతలా కొత్త రిక్రూట్‌మెంట్‌ను ఐటీ కంపెనీలు ఇంతలా తగ్గించుకోవడం ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.