Tuesday, November 19, 2024

JIO | జియో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు.. దేశంలోనే తొలిసారి

దేశంలో తొలి ఉపగ్రహ ఆధారిత ఫైబర్‌ సర్వీసెను విజయవంతంగా అమలు చేసినట్లు రిలయన్స్‌ జియో శుక్రవారం నాడు ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనున్నట్లు తెలిపింది. జియోస్పేస్‌ ఫైబర్‌గా పిలుస్తున్న ఈ సర్వీస్‌ను భారత మొబైల్‌ కాంగ్రెస్‌ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రిలయన్స్‌ జియో విజయవంతంగా ప్రదర్శించింది.

జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల మంది కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ లైన్‌, వైర్‌లెస్‌ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తోంది. ప్రతి ఇంటికి డిజిటల్‌ సేవలను అందించాలన్న లక్ష్యంతో జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ వంటి బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు జియో స్పేస్‌ ఫైబర్‌ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఎలాంటి జాప్యంలేని, వేగవంతమైన ఇంటర్నెట్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలను ప్రాంతాలతో సంబంధం లేకుండా అందిస్తున్నట్లు పేర్కొంది.

జా శాటిలైట్‌ నెట్‌వర్క్‌తో జియో టూ5జీ సేవలు కూడా దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని వివరించింది. తాజా మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌ టెక్నాలజీ కోసం జియో ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. గిగాబిట్‌ స్పేస్‌ నుంచి ఫైబర్‌ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని తెలిపింది. దీని ద్వారా జియోకు ఎస్‌ఈఎస్‌ కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్‌ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ లభిస్తుందని తెలిపింది.

- Advertisement -

దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతికతతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని తెలిపింది. జియో స్పేస్‌ఫైబర్‌ సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే నెట్‌వర్క్‌లో గుజరాత్‌ గిర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్సా, ఒడిశాలోని నవరంగాపూర్‌, అసోంలోని ఓఎన్‌జీసీ జోర్హట్‌ వంటి మారుమూల ప్రాంతాలను చేర్చినట్లు జియో తెలిపింది.

భారత్‌లో లక్షలాది ఇళ్లు, వ్యాపారాలకు జియో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించామని పేర్కొంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్న వారికి జియో స్పేస్‌ఫైబర్‌ ద్వారా సేవలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. జియో స్పేస్‌ ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా కొత్త డిజిటల్‌ సమాజంలో చేరి గిగాబిట్‌ యాక్సెస్‌తో ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందవచ్చని రిలయన్స్‌ ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ అకాశ్‌ అంబానీ తెలిపారు. ఇది పని చేసే తీరును ఆయన ప్రధాన మంత్రికి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement