5జీ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ జియో ముందస్తు డిపాజిట్ (ఈఎండి) కింద 14 వేల కోట్ల రూపాయాలు చెల్లించింది. భారతీ ఎయిర్ టెల్ 5,500 కోట్లు డిపాజిట్ చేసింది. అదానీ గ్రూప్ మాత్రం 100 కోట్లు డిపాజిట్ చేసింది. వోడాఫోన్ ఐడియా సంస్థ 2,200 కోట్లు డిపాజిట్ చేసింది. డిపాజిట్ ఆధారంగా అర్హత పాయింట్లను కేటాయిస్తారు. అత్యధికంగా డిపాజిట్ చేసిన జియోకు అన్ని సం స్థల కంటే ఎక్కువగా 1,59,830 పాయింట్లు కేటాయించారు.
ఎయిర్‌టెల్‌కు 66,330 పాయింట్లు, వోడాఫోన్ ఐడియాకు 29,370 పాయింట్లు కేటాయించారు. అదానీకి చెందిన అదానీ నెట్‌వర్స్‌కు 1650 పాయింట్లు కేటాయించారు. 5జీ వేలం ఈ నెల 26న జరుగుతుంది. మొత్తం 72 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేలానికి పెడుతున్నారు. దీని మొత్తతం విలువ 4.3 లక్షల కోట్లు. ఈ వేలం ద్వారా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆశిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.