Thursday, November 21, 2024

JIO | జియో ఎయిర్‌ఫైబర్ లో డేటా బూస్టర్‌ ప్లాన్‌

ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 5జీ ఆధారిత జియో ఎయిర్‌ఫైబర్‌ వైర్‌లెస్‌ బ్రాండ్‌బ్యాండ్‌లో కంపెనీ డేటా బూస్టర్‌ పేరుతో మరో కొత్త ప్లాన్‌ను తీసుకు వచ్చింది. దీని ధర 401 రపాయలుగా కంపెనీ ప్రకటించింది. దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్‌కు సబ్‌స్రైబ్‌ అయ్యి ఉండాలి. రెగ్యులర్‌ మ్యాక్స్‌ పేరిట జి యో ఎయిర్‌ఫైబర్‌ మొత్తం ఆరు బేసిక్‌ ప్లాన్లను అందిస్తోంది. కనెక్షన్‌ యాక్టివ్‌గా ఉండాలంటేవీటిలో ఏదో ఒక దాన్ని సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఉండాలి.

తాజాగా తీసుకు వచ్చిన 401 రూపాయల డేటా బూస్టర్‌ ప్లాన్‌తో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ బేసిక్‌ ప్లాన్‌తో పాటే ముగిస్తుంది. అంటే కొత్త బిల్లింగ్‌ సైకిల్‌ ప్రారంభమైతే, డేటా బూస్టర్‌ ప్లాన్‌ ముగిసినట్లే. అందులో మిగిలిన డేటా ఇక పోయినట్లే. ఒకవేళ ఎక్స్‌ట్రా డేటా కావాలంటే కొత్త మళ్లి డేటా బూస్టర్‌ తీసుకోవాలి. వాస్తవానికి ఈ డేటా బూస్టర్‌ ప్లాన్‌ చాలా తక్కువ మందికే అవసరం కావొచ్చు.

బేసిక్‌ ప్లాన్‌లోనే యూజర్లకు నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. 100 ఎంబీపీఎస్‌ లేదా అంతకంటే తక్కువ స్పీడ్‌తో కూడిన ప్లాన్లను యాక్టివేట్‌ చేసుకునేవారికి అదనపు డేటా అవసరమయ్యే అవకాశం ఉండకపోవచ్చుని కంపెనీ తెలిపింది. జియో ఎయిర్‌ఫైబర్‌ దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 494 పట్టణాలల్లో దీని సేవలు లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement