Friday, November 22, 2024

Reliance Jio | తక్కువ ధరకే జియో క్లౌడ్ ల్యాప్‌టాప్..

ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్‌ జియో’ చౌకధరలో లాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ విషయమై టెక్‌ దిగ్గజాలు హెచ్‌పీ, ఎసెర్‌, లెనెవో సంస్థలతో రిలయన్స్‌ జియో సంప్రదింపులు జరుపుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘క్లౌడ్ లాప్‌టాప్‌’ పేరుతో రూ.15 వేలకే దీన్ని తీసుకొతున్నట్లు సమాచారం. అన్ని సర్వీసులు పొందేందుకు వీలు కలిగేలా, లాప్‌టాప్‌ల ఖర్చు తగ్గించేలా జియో క్లౌడ్‌ లాప్‌టాప్‌ ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే క్లౌడ్‌ లాప్‌టాప్స్‌ కోసం క్రోమ్‌బుక్‌ను హెచ్‌పీ పరీక్షిస్తున్నది. అయితే ఈ విషయమై అధికారికంగా వెల్లడించడానికి ఆ కంపెనీ ముందుకు రాలేదు. ప్రస్తుతం మార్కెట్లో లాప్‌ టాప్‌ ధర కనీసం రూ.50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే. మెమొరీ, ప్రాసెసింగ్‌ పవర్‌, చిప్‌ సెట్‌ తదితర హార్డ్‌ వేర్‌ టూల్స్‌ను బట్టి జియో ‘క్లౌడ్‌ లాప్‌టాప్‌’ ధర ఆధారపడి ఉంటుందని జియో అధికార వర్గాలు చెబుతున్నాయి. జియో క్లౌడ్‌ బ్యాక్‌ ఎండ్‌ కేంద్రంగా ‘జియో క్లౌడ్‌ లాప్‌టాప్‌ రూపుదిద్దుకోనున్నది.

ఫలితంగా అత్యధిక శక్తి, సామర్థ్యాలతో కూడిన హార్డ్‌ వేర్‌ వల్ల సాధారణంగా ధర పెరుగుతుంది. కానీ ఈ లాప్‌ టాప్‌ ధర తగ్గుతుందని చెబుతున్నారు. రిలయన్స్‌ జియో పర్సనల్‌ కంప్యూటర్‌ యూజర్ల కోసం క్లౌడ్‌ పీసీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తెస్తున్నది. దీని టారిఫ్‌ ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. కొత్త కంప్యూటర్లు కొనలేని వారు అన్ని రకాల కంప్యూటర్‌ సర్వీసులు పొందేలా క్లౌడ్‌ మంత్లి సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. గత జూలై 31న రిలయన్స్‌ జియో తొలి లెర్నింగ్‌ బుక్‌.. జియో బుక్‌ లాప్‌ టాప్‌ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement