రిలయన్స్ జియో 5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్‌ను మరికొన్ని పట్టణాలకు విస్తరించింది. ప్రారంభంలో ఈ సేవలను హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చెెన్నయ్, ఢిల్లి, కోల్‌కతా, ముంబై, పుణే మొత్తం 8 నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. దీపావళి సందర్భంగా తాజాగా మరో 115 పట్టణాలు, నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వెబ్‌సైట్‌లో జియో ఎయిర్‌ఫైబర్ కోసం ప్రత్యేకంగా ఏ పేజీని ప్రారంభించిన కంపెనీ అందులో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించిన పట్టణాలు, నగరాల జాబితాను అందుబాటులో ఉంచింది.
తెలుగు రాష్ట్రాల్లో…
తెలంగాణలో హైదరాబాద్, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల , సూర్యాపేట, తాండూరు, వరంగల్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ సేవలు లభిస్తాయి. వీటితో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లి, పశ్చిమ బెంగాల్‌లో పలు నగరాల్లో జిఓ ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించారు. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లో 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, స్మార్ట్ హోం సేవలు పొందవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్‌లో నెలకు 599 రూపాయల నుంచి 1199 రూపాయల వరకు ప్లాన్లు ఉన్నాయి. జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్‌లో 1,499 నుంచి 3,999 రూపాయల వరకు పాన్లు ఉన్నాయి. అన్ని ప్యాన్లలో 14 ఓటీటీ యాప్‌లు ఇస్తున్నారు. వీటిలో జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, యానివర్సల్ ప్లస్, లయన్స్ గేట్, సన్‌నెక్ట్ట్స్, హోయ్‌చాయ్, డిస్కవరీ ప్లస్, షెమారూపీ, ఆల్ట్ బాలాజీ, ఇరోస్ నౌ, ఎపిక్ ఆన్, డాక్యుబే వంటివి లబిస్తాయి. మ్యాక్స్ ప్లాన్స్‌లో ఈ 14 యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సియో సినిమా ప్రీమియం అదనంగా ఇస్తున్నారు.