ప్రముఖ ఫ్రెంచ్ కంపనీ నోకియా రిలయన్స్ జియోకు 5జీ నెట్‌వర్క్‌ను నిర్మించనుంది. ఈ మేరకు రిలయన్స్ నుంచి కాంట్రాక్ట్ పొందినట్లు నోకియా సోమవారం నాడు ప్రకటించింది. దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ నెట్‌వర్క్‌ను జియో నిర్మించనుంది.
జియోకు 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం నోకియా ఏయిర్ స్కేల్ సామాగ్రిని అందించనుంది. ఇందులో బేస్ స్టేషన్ల నిర్మాణం, 5జీ మల్టిdపుల్ ఇన్‌పుట్స్, మల్టిపుల్ అవుట్‌పుట్ యాంటీన్నాలను, రి మోట్ రేడియో హెడ్స్‌ను సరఫరా చేయనుంది.
5జీ నెట్‌వర్క్‌ను ప్రత్యేకంగా నిర్మించాలని జియో నిర్ణయించింది.
దీని వల్ల 5జీ స్పీడ్‌ను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందించడానికి వీలుకలుగుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు పూర్తి స్థాయి నెట్‌వర్క్ అనుభవాన్ని అందించేందుకు జియో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. తమ నెట్‌వర్క్‌పై రిలయన్స్ జియో నమ్మకం ఉంచినందుకు సంతోషంగా ఉందని నోకియా సీఈఓ పిక్కా లెండ్‌మార్క్ చెప్పారు.