అమెజాన్ మాజీ సీఈవో జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. తాజాగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం బెజోస్ సంపద విలువ 20300 కోట్ల డాలర్లు (సుమారు రూ.15 లక్షల కోట్లు). ఈ మధ్య భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత భరణంగా తన కంపెనీ షేర్లలో 25 శాతం ఇవ్వాల్సి వచ్చినా.. ఆయన సంపద మాత్రం తగ్గలేదు. బెజోస్ సంపదలో మెజార్టీ వాటా అమెజాన్‌దే కాగా.. బ్లూ ఆరిజిన్, వాషింగ్టన్ పోస్ట్ మీడియా నుంచి మరికొంత మొత్తం వస్తుంది. 2020లో కరోనా కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలం కాగా.. అమెజాన్ ఈ-కామర్స్ బిజినెస్‌కు డిమాండ్ పెరగడంతో బెజోస్ సంపద భారీగా పెరిగింది. కాగా ఆయన స్పేస్ బిజినెస్‌పై కన్నేసిన విషయం తెలిసిందే.
గతేడాది అమెజాన్ సీఈవోగా బెజోస్ 81,840 డాలర్లు అందుకున్నారు. ఇది కాకుండా అదనంగా పరిహారాల రూపంలో మరో 16 లక్షల డాలర్లు అందుకోవడం విశేషం. ఆయన సంపద ప్రస్తుతం కొన్ని దేశాల జీడీపీలనే మించిపోయిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన ఓ సాధారణ అమెరికన్‌లా జీవించరని, ఇప్పటి వరకూ బెజోస్ అసలు పన్నులే చెల్లించరని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ద్వారా సేకరించిన డేటాతో స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: శ్రీలంకలో టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్