Friday, November 22, 2024

జావా-యెజ్డీ తక్త్సాంగ్‌ ట్రైల్‌ రైడ్‌.. 1000 కి.మీ ప్రయాణం

జావా -యెజ్డీ మోటార్‌ సైకిల్‌ వార్షిక తక్త్సాంగ్‌ ట్రైల్‌ రైడ్‌ను ప్రారంభించింది. ఈ రైడ్‌లో 14 మంది పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అందమైన కొండ ప్రాంతాల నుంచి సాగుతుంది. దిమాపూర్‌ నుంచి ప్రారంభించిన ఈ రైడ్‌ను నిర్వాహకులు జెండా ఊపి ప్రారంభించారు. జావా, యెజ్డీ నోమాడ్స్‌ మోటార్‌ సైకిళ్లు దాదాపు 1,000 కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. తక్త్సాంగ్‌ ట్రైల్‌ రైడ్‌.. జావా-యెజ్డీ నోమాడ్‌ రైడ్‌ కొండ ప్రాంతాల్లో ఎదురయ్యే ఛాలెంజెస్‌ను తెలుసుకుంటుంది. ఈ రైడ్‌.. దిమాపూర్‌ నుంచి జోర్హాట్‌, ఇటానగర్‌, తేజ్‌పూర్‌, గువాహటి మీదుగా కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో కంపెనీ.. తన డీలర్‌షిప్‌తో పాటు సర్వీస్‌ నెట్‌వర్క్‌ పరంగా బలమైన వృద్ధిని సాధించుకుంది. ఈ రైడ్‌లో భాగంగా.. సంచార జాతుల సమస్యలు, భారత్‌ సైన్యంతో పాటు సాయుధ బలగాల ధైర్యసాహసాల గురించి తెలుసుకుంటారు. అమరులైన జవాన్ల నివాళ్లు కూడా అర్పిస్తారు. క్లాసిక్‌ లెజెండ్స్‌ సీఈఓ ఆశీష్‌ సింగ్‌ జోషి మాట్లాడుతూ.. తక్త్సాంగ్‌ ట్రైల్‌ రైడ్‌ ద్వారా.. తమ రైడర్ల ఉత్కంఠభరితమైన అనుభవాన్ని తెలియజేస్తామన్నారు. జావా, యెజ్డీల సామర్థ్యాలను కూడా పరీక్షించి వివరిస్తామని తెలిపారు. దీని కోసం ఈశాన్య రాష్ట్రాల నుంచి సాగే మార్గాన్ని ఎంచుకున్నామని వివరించారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకు నిర్ణయించామన్నారు. దిమాపూర్‌ నుంచి ప్రారంభించి.. లఖింపూర్‌, దిబ్రూఘర్‌, శివసాగర్‌, టిన్సుకియా (రెండో ఔట్‌లెట్‌)లో సెంటర్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement