Saturday, November 23, 2024

మేఘా గ్యాస్‌ ఇక మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ.. పేరు మారినట్లు వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్‌ పేరు మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ)ని మేఘా గ్యాస్‌ బదులు ఎంసీజీడీపీఎల్‌ కంపెనీ ఇఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ను చేపడుతోంది. ఇప్పటివరకు మేఘాగ్రూప్‌లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కు ఉన్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపీఎల్‌కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్‌ చేసిన అభ్యర్థనను పెట్రోలియం సహజ వాయువు నియంత్రణ మండలి(పీఎన్జీఆర్బీ) ఆమోదించింది. ఇక నుంచి మేఘా గ్యాస్‌కు ఉన్న అన్ని కార్యకలాపాలు పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపీఎల్‌ కిందకు వస్తాయి. దేశంలోని 10 రాష్ట్రాలు, 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాల్లో కంపెనీ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ను ఎంసీజీబీపీఎల్‌ ఇక నుంచి అమలు చేస్తోంది.

మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, రాజస్థాన్‌, కర్ణాటక, ఏపీ, తెలంగాన సిటీ గ్యాస్‌ పంపిణీ కార్యకలాపాలను మేఘా గ్యాస్‌ ఇప్పటికే చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపీఎల్‌ వీటని చేపడుతుంది. ఇప్పటికే 2000 కి.మీ మేర ఎండీపీఈ లైన్‌, 500 కి.మీ పైగా స్టీల్‌ పైప్‌లైన్‌లను మేఘా గ్యాస్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కిపైగా సీఎన్జీ స్టేషన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకుపైగా గృహాలకు పైపుల ద్వారా సహజ వాయువును అందిస్తోంది. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేండ్లలో మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement