హైదరాబాద్ : ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ ఆంబులెన్స్ నిర్దేశనలతో పూర్తిగా-నిర్మించబడిన ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ మార్గదర్శకమైన ఆంబులెన్స్ అత్యవసర వైద్య సంరక్షణ సేవల్లో ఒక కొత్త ప్రామాణికాన్ని ఏర్పరుస్తూ, రోగుల రవాణాలో అసమానమైన విశ్వసనీయత, భద్రత, సౌకర్యాన్ని అందించే వేగవంతమైన స్పందనను అందించుటకు తయారుచేయబడింది.
ఈసందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ తోరు కిషిమోటో మాట్లాడుతూ… 14 బెస్ట్-ఇన్-క్లాస్ లక్షణాలతో భారతీయ మార్కెట్ కోసం తయారుచేయబడిన తమ ప్రత్యేక ఉత్పత్తి, ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ను ప్రవేశపెట్టుటకు తామెంతో సంతోషిస్తున్నామన్నారు. ఇసుజు ఎప్పుడు నమ్మకం, విశ్వసనీయతలకు పర్యాయపదంగా నిలిచిందన్నారు.
ఈ కొత్త ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ఏఐఎస్-125 టైప్ సీ ఆంబులెన్స్ కింద నిర్దేశనలకు అనుగుణంగా అత్యధిక-నాణ్యత కలిగిన నిర్మాణం, సాటిలేని ధృఢత్వం అందిస్తూ ఈ విలువలను ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ ప్రారంభంతో ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక గేమ్ చేంజర్ గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందన్నారు. వినూత్నంగా ఉన్న, భారతీయ మార్కెట్ ప్రత్యేక డిమాండ్స్ కోసం తయారుచేయబడిన నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందన్నారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆంబులెన్స్ వర్గంలో తమ ఇసుజు డి-మ్యాక్స్ ఆంబులెన్స్ ఒక కొత్త బెంచ్మార్క్ ను ఏర్పరుస్తుందన్నారు.