Thursday, November 21, 2024

ఇన్వెస్టర్ల సంపద 3.20 లక్షల కోట్ల ఆవిరి.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా పతనం

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ధరల పెరుగుదల, కోవిడ్‌ భయాలు, మండుతున్న ముడి చమురు ధరలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ….. ఇలా అన్నీ కలిసి స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేశాయి. ఇది మార్కెట్లకు బ్లాక్‌ ఫ్రైడ్‌గా మిగిలింది. ఇన్వెస్టర్లకు కనీళ్లు తెప్పించింది. ఒక్క దెబ్బతో శుక్రవారం నాడు 3.20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద అవిరైంది…
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో ఆ ప్రభావం ప్రారంభంలోనే మన మార్కెట్లపై పడింది. ఉదయం నుంచి స్టాక్‌ ఎక్సైంజ్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

54,706 పాయింట్ల వద్ద ప్రారంభమైన ట్రేడిండ్‌, ఇంట్రాడే లో 54,206 పాయింట్లతో కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 1016.84 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ముగిసింది. మొత్తంగా 1.94 శాతం నష్టపోయింది. నిఫ్టీ 276.30 పాయింట్ల నష్టంతో 16,201.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.69 శాతం నష్టపోయింది. దాదాపు అన్ని షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, ఐటి, ఆర్థిక సేవల సూచీలు భారీగా పతనమయ్యాయి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement