దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థికంగా సహాయపడాలని, భారీ పెట్టుబడులు పెట్టాలని ఇండియా ఇంక్ సంస్థను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రైవేటు కంపెనీలు ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుతం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో వెసులుబాటు కల్పించామని గుర్తు చేశారు. దీంతో పాటు పలు ప్రైవేటు రంగాల్లో.. ప్రైవేటు పెట్టుబడిదారులు భారీగా ఇనెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రైవేటు ప్లేయర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టేందుకు సహకరించాల్సిదిగా సూచించారు. కరోనా మహమ్మారి కంటే ముందు.. 2019, డిసెంబర్లో.. కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో కోతలు విధించిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఏ కంపెనీ అయితే.. ట్యాక్స్ ఇన్సెంటివ్ ఫలాలు పొందడం లేవో.. అవి ఈ తరహా లాభాలు పొందాల్సిందిగా కోరారు. 2019, డిసెంబర్లో బేసిక్ కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం తగ్గించి.. 22 శాతంగా నిర్ణయించిందని తెలిపారు. కొత్త మ్యానుఫాక్చరింగ్ కంపెనీల కోసం ఈ 25 శాతాన్ని.. 15 శాతానికి తగ్గించామని చెప్పుకొచ్చారు.
కొత్త కంపెనీలకు వెసులుబాటు..
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో.. కొత్త మ్యానుఫాక్చరింగ్ యూనిట్లకు వెసులుబాటు కల్పించామన్నారు. ఈ కంపెనీలకు విధించే 15 కార్పొరేట్ ట్యాక్స్ వెసులుబాటు అందించే.. సమయాన్ని కూడా పెంచుతున్నట్టు ప్రకటించామన్నారు. 2024 వరకు కొత్త మ్యానుఫాక్చరింగ్ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించడం జరుగుతుందన్నారు. ఇండస్ట్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ ఎకానమీని బూస్ట్ అందించాల్సిందిగా కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీకి విధించే 18 శాతం ట్యాక్స్‌ను 15 శాతానికి తగ్గించామన్నారు. సర్‌చార్జీ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించామని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇన్‌కం బేస్ కూడా 1 కోటి నుంచి రూ.10కోట్లకు పెంచుతున్నట్టు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..