న్యూఢిల్లి: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత్ మార్కెట్లోకి మంగళవారం టైగూన్ యూవీని విడుదల చేసింది. టైగూన్ ప్రారంభధర రూ.31.99లక్షలుగా నిర్ణయించింది. టైగూన్ బుకింగ్స్‌ను కూడా మంగళవారం ప్రారంభించారు. ముందుగా బుక్ చేసుకున్నవారికి జనవరి రెండో వారంలో డెలివరీ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రీమియం లుక్‌తో టైగూన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని డైరెక్టర్ ఆషిష్ గుప్తా పేర్కొన్నారు. ఆధునిక సేఫ్టీ విభాగాలు, 12.65కిమీ మైలేజీ, 7స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ఐదుగురు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం, యాంటి లాకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాదిలో ఫోక్స్‌వ్యాగన్ ఎస్‌యూవీల్లో నాలుగు మోడల్స్ విడుదల చేసినట్లు గుప్తా తెలిపారు.