Friday, November 8, 2024

Poultry Expo | హైదరాబాద్‌లో అంతర్జాతీయ పౌల్ట్రి ఎక్స్‌పో !

దక్షిణాసియాలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు కొనసాగనుంది. 16వ విడత పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2024ను నవంబర్‌ 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌, పౌల్ట్రీ ఇండియా వెల్లడించాయి.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ కాంప్లెక్స్‌లో ఈ సదస్సు జరుగుతుందని చెప్పాయి. ఈ మేరకు శుక్రవారం పౌల్ట్రి ఇండియా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఎక్స్‌పోకు అనుబంధంగా నవంబర్‌ 26న హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో నాలెడ్జ్‌ డే-టెక్నికల్‌ సెమినార్‌ నిర్వహిస్తామని పేర్కొంది.

”అన్‌లాకింగ్‌ పౌల్ట్రీ పొటెన్షియల్‌” అనే అంశంపై నెట్‌వర్కింగ్‌, విజ్ఞానాన్ని పంచుకునేందుకు, అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ అంతర్జాతీయ పౌల్ట్రీ ఎక్స్‌పో సముచిత వేదిక కానుంది. 50కి పైగా దేశాల నుంచి సుమారు 400 మంది ప్రదర్శకులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. కోళ్ళ పరిశ్రమ రైతులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ఇంటిగ్రేటర్లు, ప్రపంచ పౌల్ట్రీ నిపుణులు సహా దాదాపు 40,000 మంది సందర్శకులు రావొచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement