Tuesday, November 26, 2024

గోల్డెన్‌ ఇయర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు వడ్డీరేటు పెంపు

సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆకర్షణీయ వడ్డీరేట్లు ఆఫర్‌ చేస్తున్నది. తాజాగా మరో 10 బేసిక్‌ పాయింట్లు వడ్డీ పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు ఇప్పటికే అదనంగా అందిస్తున్న 0.50 శాతం వడ్డీకి తోడు అదనంగా 0.20 శాతం వడ్డీ అందిస్తున్నది. ఇంతకుముందు గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ఇన్వెస్ట్‌మెంట్లకు 0.10 శాతం అదనంగా వడ్డీ కల్పించింది. 5–10 ఏళ్లలోపు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఈ స్పెషల్‌ వడ్డీరేట్లు వర్తిస్తాయి. ఈ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఏడో తేదీ వరకు పొడిగించింది. తాజా వడ్డీరేట్ల సవరణతో గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌పై సీనియర్‌ సిటిజన్లు 6.95 శాతం వడ్డీ పొందుతారు.

పెంచిన వడ్డీరేట్లు తక్షణం ( 2022 అక్టోబర్‌ 29) అమల్లోకి వస్తాయి. ఫ్రెష్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతోపాటు రెన్యూవల్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు కూడా సవరించిన వడ్డీరేట్లు అమలవుతాయి. ఈ పథకం కింద మదుపు చేసిన సొమ్ము మెచ్యూరిటీ గడువుకు ముందు విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ లభిస్తుంది. 2020 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ప్రారంభించింది. నాటి నుంచి పలు దఫాలుగా ఈ స్కీమ్‌ను పొడిగిస్తూ వచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్‌ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్‌ 50 బేసిక్‌ పాయింట్లవడ్డీరేట్లు పెంచేసింది. సవరించిన వడ్డీరేట్లు శనివారం (2022 అక్టోబర్‌ 29) నుంచి అమల్లోకి వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement