హైదరాబాద్: రిటైల్, షాపింగ్ సెంటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఇనార్బిట్ మాల్స్ దీపావళి పండుగను పురస్కరించుకొని బడే దిల్‌వాలి దీపావళి పేరిట ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం సాంప్రదాయ హద్దులు దాటి, ఈ దీపావళికి అందరూ ఒకే కుటుంబంగా కలిసి రావాలని ఆహ్వానిస్తుంది. ఈ ప్రచారం ద్వారా ఇనార్బిట్ మాల్స్ ఒక చిరస్మరణీయ అనుభవానికి వేదికను ఏర్పాటు చేసింది. ఇది ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని, దయను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది.
ప్రచార ప్రారంభం సందర్భంగా ఇనార్బిట్ మాల్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్, మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఎస్ వి పి అండ్ హెడ్ లీజింగ్ రోహిత్ గోపాలని మాట్లాడుతూ… ఇనార్బిట్ మాల్స్‌లో దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదని, ఇది ఐక్యత వేడుక అని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం తమ బడే దిల్‌వాలి దీపావళి ప్రచారం ద్వారా దీపావళి ఆనందాన్ని పంచుకోవడానికి తమ అభిమానులను ప్రేరేపించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
నాష్ఎక్స్‌పి మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కేవల్రమణి మాట్లాడుతూ….ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా ఇనార్బిట్‌తో కలిసి పనిచేయడం ఒక ఏజెన్సీగా తాము గర్విస్తున్నామన్నారు. మాల్స్‌లో అనుభవ పూర్వకమైన యాక్టివేషన్‌లతో సహా నిజమైన, అర్ధవంతమైన అనుభవాల ద్వారా దీపావళి అంటే ఏమిటో ప్రజలకు తెలియజేయాలని తాము కోరుకుంటున్నామన్నారు.