Friday, November 22, 2024

HYD: ఉబ్బసం ఆస్థమా మేనేజ్ మెంట్ లో ఇన్హేల్ థిరపీ ముఖ్యమైన భాగం..డా. ఎం. ఎస్. గోపాల కృష్ణ

హైదరాబాద్ : ఇన్హేల్ చేసే థిరపీ అనేది ఉబ్బసం ఆస్థమా మేనేజ్ మెంట్ లో అత్యంత ముఖ్యమైన భాగమని విజ‌య‌వాడ కన్సల్టంట్ పల్మనాలజిస్ట్ డా.ఎం.ఎస్. గోపాల కృష్ణ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… చికిత్స ట్రీట్మెంట్ కు సంబంధించిన అపోహలు ఉబ్బసం రోగులను డాక్టర్- ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేల్ చేసే థిరపీని ఒప్పుకోవడానికి లేదా దానిని పాటించడానికి తరచూ నివారిస్తాయన్నారు. నిజం చెప్పాలంటే, జిఏఎన్ అధ్యయనం ప్రకారం ఉబ్బసం వున్న 9శాతం కన్నా తక్కువ వ్యక్తులు ఐసిఎస్ (అనగా కార్టికోస్టిరాయిడ్సుని ఇన్హేల్ చేయుట) స్వీకరిస్తారన్నారు. ఇది ఉబ్బసంను మేనేజ్ చేయడానికి అత్యంత కీలకమైనదన్నారు.

ఇన్హేలర్లు ఎందుకు ?
దీర్ఘ కాల ఊపిరితిత్తుల సమస్యలు క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్ అనగా ఉబ్బసం వంటి వాటిని మేనేజ్ చేయడానికి ఇన్హేల్ చేసే థిరపీ అనేది కార్నర్ స్టోన్ చికిత్స. ఈ చికిత్స సరైన సమయంలో మందును పంపిణీ చేస్తుంది, దీని డోసేజ్, ఇది ఉపశమనం అందించే కాల వ్యవధి – దీని అంత ముఖ్యమైనదిగా చేస్తాయన్నారు. ఇన్హలేషన్ కోసం ఉపయోగించే పరికరములు డివైజ్లు నేరుగా గాలి దారులు ఎయిర్ వేలు, ఊపిరితిత్తులు లంగ్స్ లోకి మందుని మెడిసిన్ పంపిణీ చేస్తాయన్నారు. ఇలా చేయడం వలన తక్కువ డోసేజీలు అవసరం పడతాయన్నారు. నోటి ద్వారా ఓరల్ ఇచ్చే మెడికేషన్ కన్నా ఇవి తక్కువ సైడ్ ఎఫెక్టులు కలిగివుంటాయన్నారు. ఇంకా చెప్పాలంటే, ఇన్హేలర్లు తొందరగా-పని చేసే మెడికేషన్ కలిగి, అవసరం పడినప్పుడు త్వరగా ఉపశమనం కలిగిస్తాయన్నారు. ఇది ఉబ్బసంతో బాధపడే వారికి అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఉబ్బసం ఎటాక్ అనేది అత్యంత తీవ్రంగా వుంటుందన్నారు. అటువంటి పరిస్థితుల్లో తొందరగా-పని చేసే ఉబ్బసం ఇన్హేలర్ అనేది అక్కరకు వస్తుందన్నారు. ఇది ఎంతో ప్రభావంను చూచిస్తుందన్నారు.

సరైన ఇన్హేలర్ ఉపయోగించడం…..
సరైన ఇన్హేలరుని ఉపయోగించడం, దానిని ఉపయోగించే సరైన విధానంను తెలుసుకుని ఉపయోగించడం అనేవి అత్యంత ముఖ్యమైనవన్నారు. ఇలా చేయడం వలన అవసరమైన మెడికేషనుని పొంది ఉబ్బసం లక్షణాలను మేనేజ్ చేయవచ్చు, దాని ముమ్మరమైన స్థితిని నివారించవచ్చన్నారు. ఉబ్బసం ఎటాక్ నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చన్నారు. ఇన్హేలర్లను దీర్ఘ-కాల చికిత్సా ఆప్షనుగా ప్రిస్క్రైబ్ చేయవచ్చన్నారు. వీటిని మీ ఫిజీషియన్ సూచినట్టుగా క్రమం తప్పకుండా ఉపయోగించాలన్నారు (ఉదాహరణకు ఉబ్బసానికి) లేదా న్యుమోనియా వంటి చికిత్స అందించ గలిగేవి, కానీ తీవ్రమైన ఎక్యూట్ రోగాలకు వీటిని ప్రిస్క్రైబ్ చేయవచ్చు.

- Advertisement -

ఉబ్బసం కోసం ఎన్నో రకాల ఇన్హేలర్లు లభ్యతలో వున్నాయి. ఇవి మీ ఉబ్బసం లక్షణాలను మేనేజ్ చేయడానికి సహాయం చేస్తాయన్నారు. మీ పరిస్థితి తీవ్రతను, ప్రత్యేకతలను బట్టీ మీ ఫిజీషియన్లు వీటిని ప్రిస్క్రైబ్ చేస్తారన్నారు.

అత్యంత సాధారణ ఇన్హేలర్ రకాలు ఈ క్రింది విధంగా వుంటాయి…
ప్రెజర్ కలిగిన మీటర్డ్ డోస్ ఇన్హేలర్లు (పిఎండిఐలు):
ఇది సర్వ సాధారణంగా ఉపయోగించే ఇన్హేలర్. దీంట్లో ప్రెజర్ కలిగిన ఒక డబ్బా కానిస్టర్ వుంటుందన్నారు. ఈ డబ్బాలో ఏరోజోల్ ప్రొపలెంట్లతో కూడిన మందు మెడికేషన్ వుంటుందన్నారు. బటన్ ను నొక్కినప్పుడు ఈ మందు స్ప్రే వలే బయటకి వస్తుందన్నారు. ఇన్హేలరుతో పాటు ఒక స్పెసరుని ఉపయోగించడం వలన పూర్తి డోసేజిని ఇన్హేల్ చేసే ప్రక్రియ సులభం అవుతుందన్నారు. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకు, వయసులో పెద్ద వ్యక్తులకు సహాయకారి అన్నారు. ఒకసారి మందు డిస్పెన్స్ అయ్యాక ఈ స్పెసర్ ఇన్హేలర్, నోటికి మధ్య ఒక ట్యూబులో ఆ మందుని ఆపి వుంచుతుందన్నారు.

పొడి పౌడర్ ఇన్హేలర్లు (డిపిఐలు): మందు మెడికేషన్ బయటకి పంపడానికి ఒక ప్రొపలెంటుని ఉపయోగించే బదులు పొడి పౌడర్ ఇన్హేలర్లు (డిపిఐలు) మందుని పొడి పౌడర్ రూపంలో బయటకి పంపుతాయన్నారు. ఈ మందు బయటకి వచ్చేడప్పుడు ఉపయోగించే వ్యక్తి బాగా లోపలికి, తొందరగా దానిని శ్వాస ద్వారా తీసుకోవాలి పీల్చుకోవాలన్నారు. అవసరం పడిన డోసేజ్ ప్రకారం, ఈ డిపిఐలు చాలా ఎక్కువ కెపాసిటీ కలిగి మల్టీ-డోస్ డివైజులు లాగా లేదా ప్రతిసారీ కొత్త కాప్స్యూల్ ఫిల్ చేసే సింగిల్-డోస్ డివైజులు లాగా లభిస్తాయన్నారు.

శ్వాసకి- ఆక్ట్యువేట్ చేయబడ్డ ఇన్హేలర్లు (బిఏఐలు): శ్వాసకి-ఆక్ట్యువేట్ చేయబడ్డ మీటర్డ్-డోస్ ఇన్హేలర్లు అనేవి ఎన్నో లాభాలను అందిస్తాయన్నారు. ఇందులో కాంపాక్ట్నెస్, ఎక్కడికైనా తేలికగా తీసుకునివెళ్ళడం పోర్టబిలిటీ, మల్టీ-డోసులు వుంటాయన్నారు. సంప్రదాయంగా ఉపయోగించే ప్రెజర్ కలిగిన మీటర్డ్-డోస్ ఇన్హేలర్లలోని సమన్వయ సవాళ్ళకి ఈ ఇన్హేలర్లు సమాధానం చెబుతాయన్నారు. ఇందులో మందు మెడికేషన్ ఇన్హేల్ చేసినప్పుడు బయటకి వస్తుందన్నారు. తద్వారా ఇవి హాస్పిటల్సులో రొగులు వారే ఉపయోగించడానికి అనువుగా వుంటాయన్నారు. అయితే, వీటిని యాక్టివేట్ చేయడానికి అవసరమైన బలమైన ఇన్హలేషన్ సామర్ధ్యం లేని చిన్న పిల్లలు, పెద్దవారికి ఇవి అనువుగా వుండకపోవచ్చన్నారు.

ఎందుకు టెక్నీక్ అనేది ముఖ్యం ?
ఇన్హేలర్ సమర్ధవంతంగా పని చేయాలంటే దానిని సరిగ్గా ఉపయోగించడం అనేది కీలకమైనదన్నారు. టెక్నీక్ అనేది డివైజ్ నుంచి డివైజ్ కి మారుతుందన్నారు. కాబట్టి, రోగులు వారి డాక్టర్ నుంచి సరైన టెక్నీక్ నేర్చుకొని గైడెన్స్ పొందడం అనేది కీలకమ‌న్నారు. ఇన్హేలరుని సరిగ్గా ఉపయోగించలేకపోతే, అది రోగంను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడానికీ, పెరిగిన ఎమర్జెన్సీ రూమ్ విజిట్లకీ, అధికంగా హాస్పిటలైజ్ అయ్యే రిస్కుకీ దారితీస్తుందన్నారు. ఇంకా చెప్పాలంటే, సరిగాలేని ఉపయోగం మందుని మెడికేషన్ ఊపిరితిత్తులు, గాలిదారులలోకి వెళ్ళకుండా నివారిస్తుందన్నారు. తద్వారా ఇది చికిత్స వైఫల్యంకు దారితీస్తుందన్నారు.

ఇంకా చెప్పాలంటే, వివిధ రకాల డివైజుల మధ్య గందరగోళంను నివారించడానికి, మిగిలివున్న డోసేజిలను ట్రాక్ చేసుకోవడానికి, కంట్రోలర్, రిలీవర్ ఇన్హేలర్లను లేబుల్ చేయడం అనేది కీలకమైనదన్నారు. ప్రతి వారమూ క్రమం తప్పకుండా ఇన్హేలర్లను క్లీన్ చేయాలన్నారు. ఇలా చేయడం వలన వ్యర్ధ పదార్ధాలు అందులో చేరకుండా నివారించవచ్చన్నారు. ఇలా చేయకపోతే, ఊపిరితిత్తుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందన్నారు. చికిత్స ప్రభావం కూడా దెబ్బతింటుందన్నారు. డోస్ కౌంటర్ ఆకుపచ్చ నుంచి ఎరుపుకి మారినప్పుడు, కొన్నే డోసులు మిగిలి వున్నాయని అర్ధమ‌న్నారు. అప్పుడు కొత్త ఇన్హేలర్ కొనుక్కోవాలని సూచించడం జరుగుతుందన్నారు. ఈ సూచనలను పాటించడం ద్వారా, ఇన్హేలర్లను ఉపయోగించడం అనేది శ్రమలేనిదిగా మారుతుందన్నారు. దీర్ఘ-కాలంలో ఉబ్బసమును మేనేజ్ చేయడం అనేది సులభతరం అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement