ఇన్ఫినిక్స్ ఇటీవల తన ఏడవ వార్షికోత్సవం సందర్భంగా Note 40 Pro రేసింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో ప్లస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ధర వివరాలు :
ఇన్‌ఫినిక్స్ Note 40 Pro రేసింగ్ ఎడిషన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా,
నోట్ 40 ప్రో ప్లస్ రేసింగ్ ఎడిషన్ ప్లస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.
ఇన్‌ఫినిక్స్ Note 40 Pro సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ రేసింగ్ ఎడిషన్ సిరీస్ లోని రెండు మోడళ్లు 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చాయి. రేసింగ్ ఎడిషన్ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoC చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తొంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ రెండు మోడళ్లు కూలింగ్ టెక్నాలజీ 2.0 ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ సిరీస్ 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP + 2MP లెన్స్ లతో విడుదల అయింది. సెల్ఫీ, వీడియో కాల్స్ ఈ రెండు మోడళ్లు కూడా 32MP కెమెరాలను కలిగి ఉంది. బేస్ వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ, ప్రో ప్లస్ మోడల్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు JBL ఆధారిత డ్యూయల్ స్పీకర్‌లతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ రేసింగ్ ఎడిషన్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ సిరీస్ IP53 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.