ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీకి అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో (క్రిస్టల్ గ్రీన్, షైనీ హోల్డ్ & టింబర్ బ్లాక్) అందుబాటులో ఉంంది. ఇందులో నోటిఫికేషన్ల కోసం పిల్ ఆకారంలో ఉన్న సరికొత్త మ్యాజిక్ రింగ్ ఫీచర్ అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీని వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.6,299గా ఉంది. యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందించనున్నారు. అంటే కేవలం రూ. 5,669కే ఈ స్మార్ట్ ఫోన్ కొనేయవచ్చన్న మాట.
ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్.. !
ప్రాసెసర్: Unisoc T606, ఆక్టా కోర్, 1.6 GHz
ర్యామ్: 3 GB
స్టోరేజ్: 64 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు, 720 x 1612 px, 90 Hz
కెమెరా: 13 MP + 0.08 MP డ్యూయల్ వెనుక, 8 MP ముందు
బ్యాటరీ: 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh
కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్, 3G, 4G, VoLTE, Wi-Fi
మెమరీ: 2 TB వరకు
OS: Android v13