దేశ పారిశ్రామిక ఉత్పత్తి 12 నెలల్లో మొదటిసారిగా 19.6 శాతానికి చేరుకుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీల్ ప్రొడక్షన్ (ఐఐపీ) మే నెలలో 19.6 శాతంగా నమోదైందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికతో తెలిపింది. ఇది క్రితం నెల ఏప్రిల్‌లో 7.1శాతంగా ఉంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతం నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ నిర్ధేశించిన లక్ష్యమైన 4 శాతం కంటే ఇది ఇంకా ఎక్కువగానే ఉంది. గత రెండు త్రైమాసికాల్లోనూ ఇలానే అత్యధికంగా ఇది నమోదు అవుతూ వస్తోంది. ప్రధానంగా ఆహార పదార్ధాల ధరలు ఎక్కువగా ఉండటం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువ నమోదైందని నివేదిక తెలిపింది. కన్య్జూమర్ పుడ్ ప్రైస్ ద్రవ్యోల్బణం 7.75గా ఉంది. మేలలో నమోదైన 7.79తో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
జూన్‌లో కూరగాయలు, పెట్రోల్, డీజిల్, సుగంధ ద్రవ్యాలు, పాదరక్షల ధరలు ఎక్కువగా ఉన్నందునే రిటైల్ ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదలతో విద్యుత్ ఉత్పత్తిదే అగ్రస్థానం ఇది 23.5 శాతం పెరిగింది. తయారీ రంగం 20.6 శాతం వృద్ధి నమోదు చేసింది. మైనింగ్ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.