హైదరాబాద్: ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నిషిన్లు శుక్రవారం నుంచి సిక్ లీవ్ పెట్టారు. వేతనాలు పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తరువాత టెక్నిషిన్లు సామూహికంగా సెలవులు పెట్టారు. హైదరాబాద్లో ఇలా టెక్నిషిన్లు సెలవు పెట్టారని, వీరు వేతనాలు పెంపుదల కోరుతున్నారని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఇంజనీర్ల ఆధర్యంలో పని చేసే టెక్నిషిన్ల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని , కోవిడ్ సమయంలో వేతనాల్లోనూ కోత విధించారని అందుకే ఇప్పుడు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు ఒక టెక్నిషిన్ చెప్పారు.
అంతకు ముందు స్పైస్ జెట్ సిబ్బంది కూడా సమ్మె చేశారు. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సంస్థలు తమ సిబ్బంది వేతనాలు, ఇతర అలవెన్స్లు పెంచాలన్న డిమాండ్లను ఆమోదిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.